Bigboss6: 15 వారాలకు గానూ శ్రీ సత్య రెమ్యునరేషన్ అన్ని లక్షలా..?

-

సీరియల్ నటిగా బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి భారీ పాపులారిటీని దక్కించుకున్న శ్రీ సత్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టి తనదైన శైలిలో ప్రేక్షకులను అందంతో అలరించడానికి ప్రయత్నం చేసింది. ముఖ్యంగా ఈమె పెద్దగా తన ఆట లో పర్ఫామెన్స్ చూపించలేదు. దాంతో ఒకటి రెండు వారాలలోని ఎలిమినేట్ అవుతుందని అంతా భావించారు. కానీ ఆమె బిగ్ బాస్ మేనేజ్మెంట్ కోటా కింద 15 వారం వరకు కొనసాగింది. శ్రీ సత్యను ఎలిమినేట్ చేయాల్సిన పరిస్థితి ఎప్పుడు వచ్చినా.. ఆమెకు బదులు ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ ను ఎలిమినేట్ చేస్తూ వచ్చారు. కానీ ఎట్టకేలకు ఫినాలేకి 6 మంది సభ్యులు వెళ్ళగా వారిలో ఒకరిని మిడ్ వీక్ ఎలిమినేషన్స్ లో భాగంగా ఎలిమినేట్ చేయడం గమనార్హం.

మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా శ్రీ సత్య ఎలిమినేట్ అయింది. అయితే 15 వారాలకు గాను ఆమె ఎంత పారితోషకం తీసుకుంది అనే విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. వారానికి లక్ష రూపాయల పారితోషకం ఒప్పందం మీద హౌస్ లోకి వచ్చిన శ్రీ సత్య 15 వారాలకు గాను ఏకంగా రూ.15 లక్షల రూపాయల పారితోషకం అందుకున్నట్లు సమాచారం .దీన్ని బట్టి చూస్తే ఆమె జాక్పాట్ కొట్టినట్లే.. సీరియల్స్ ద్వారా కూడా ఆమె ఇంత సంపాదించింది లేదు. కేవలం 15 వారాల లోనే 15 లక్షల రూపాయల పారితోషకం అంటే నిజంగా కలిసొచ్చిందని చెప్పాలి.

ఇకపోతే ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ సిక్స్ రేపటితో పూర్తీ కానుంది..ఇక బిగ్ బాస్ విన్నర్ ఎలాగో రేవంత్ అని ఫిక్స్ అవ్వగా శ్రీహాన్ రన్నర్ గా నిలిచారు.

Read more RELATED
Recommended to you

Latest news