పవన్ కళ్యాణ్ దగ్గర ఇప్పుడు ఒక్క రూపాయి లేదు – నాగ బాబు

-

రాజకీయాల్లోకి రావడం వల్ల, పవన్ కళ్యాణ్ దగ్గర ఇప్పుడు ఒక్క రూపాయి లేదని మెగా బ్రదర్ నాగ బాబు అన్నారు. ది రియల్ యోగి పవన్ కళ్యాణ్ బుక్ లాంచ్ చేసిన నాగ బాబు… ఆనంతరం మాట్లాడారు.కళ్యాణ్ గురించి ఏం చెప్పిన సొంత తమ్ముడు అనుకుంటారు, ఒక కామన్ మెన్ పోయిట్ లో రాసాడు, నేను దేవుణ్ణి నమ్మను, కానీ నమ్మే వాళ్ళను రెస్పెక్ట్ ఇస్తాను, పవన్ లాగా నేను ఒక రోజు అయిన ఉండగలనా? కామ, క్రోధ లను అదుపులో పెట్టుకుంటే ఉన్నత స్థాయిలో కి వెళ్తారు, ఒక మనిషి ఎలా బ్రతకాలి అనేదానిపై పవన్ కళ్యాణ్ చాలా మంచి స్పీచ్ ఇచ్చాడు.

 

పవన్ కళ్యాణ్ మోస్ట్ కంపర్టీబుల్ పవన్ ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాడంటే చిన్నప్పుడు నుండి ఒంటరిగా ఉండేవాడు.10th క్లాస్ పాస్ అయ్యాక తను ఏంటో అర్ధం అయింది. చిరంజీవి గారి తమ్ముడు అయినంత మాత్రాన సినిమా లు ఎవరు ఇవ్వరు. ఒక మనిషి గా పుట్టాక పెరిగాం, జీవించం, చనిపోయామ అని కాకుండా ఒక లక్ష్యం ఉండాలని కోరుకున్నాడు. రాజకీయాల్లోకి రావడానికి టిడిపి లోనో, బీజేపీ లోనో చేరితే ఏదో మంత్రి పదవి వచ్చేది, కానీ స్వాతంత్ర గా పార్టీ పెట్టుకొని, లంచగొండి, అవినీతి పరులను నిలదీయటానికి పార్టీ పెట్టాడు. తనకు వున్నా ఎమౌంట్ మొత్తం పిల్లల పై ఫిక్సడు డిపాజిట్ చేసి జనసేన పార్టీ పెట్టాడని పవన్ పై ప్రశంసలు కురిపించారు నాగబాబు.

Read more RELATED
Recommended to you

Latest news