ప్రిన్స్ మహేష్ బాబు ఇంత కరోనా కలకలం రేపింది. మహేష్ బాబు ఇంట్లో ఒకరికి కరోనా సోకినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. హీరో మహేష్ బాబు సతీమణి నమ్రత సోదరి శిల్పా శిరోద్కర్ కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా మహేష్ బాబు సతీమణి నమ్రత సోదరి శిల్పా శిరోద్కర్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో కూడా పోస్ట్ పెట్టింది శిల్పా శిరోద్కర్.

తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన చేసింది శిల్పా శిరోద్కర్. దీంతో ప్రస్తుతం తాను… కరోనాకు సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు వెల్లడించింది. అతి త్వరలోనే కోలుకొని… ప్రజల ముందుకు వస్తానని పేర్కొంది. ప్రజలందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని… మాస్కులు ధరించాలని కోరింది శిల్పా శిరోద్కర్.