తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రవాదుల అరెస్ట్ కలకలం రేపింది. హైదరాబాద్ లో డమ్మీ బాంబ్ బ్లాస్ట్ కు ప్లాన్ చేసి అరెస్ట్ అయిన సమీర్, సిరాజ్ ఏ ఉగ్రసంస్థతో టచ్ లో ఉన్నారనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది. ISIS డైరక్షన్ లో పని చేస్తున్నట్లు ప్రాథమిక గుర్తించారు. ఇప్పటికే సీన్ లోకి ఎంట్రీ ఇచ్చింది NIA.
అరెస్ట్ అయిన ఇద్దరి చరిత్రను బయటకు తీస్తున్నారు అధికారులు. సోషల్ మీడియాలో సమీర్ రాడికల్ పోస్టులు పెట్టినట్లు గుర్తించారు. ఎవరి ఆదేశాల మేరకు ఉగ్రవాదులు పనిచేస్తున్నారు? వీరి వెనుక ఎవరు ఉన్నారు? అనే దానిపై ఆరా తీస్తున్నారు అధికారులు.