బిగ్ బాస్ అంటే నవ్వులు.. గొడవలు, ఏడుపులు ఉంటాయి. అన్నింటినీ మిక్స్ చేసి చూపిస్తాడు కాబట్టే బిగ్ బాస్ కి అంత క్రేజ్ వచ్చిందేమో. ఇక ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాస్ సీజన్ -5 లో ఇంటిసభ్యుల ఫస్ట్ లవ్ గురించి అడిగి కంటతడి పెట్టించాడు. ఇక ఇంటిసభ్యుల్లో సిరి హన్మంతు మొదటి ప్రేమ కథ గురించి అడగ్గా…తాను తన ఇంటి ముందు ఉండే అబ్బాయి తో మొదట ప్రేమలో పడ్డానని తెలిపింది. మొదట అతడే తనకు ప్రపోజ్ చేశాడని. అతడితో కలిసి ఇంటినుండి వెళ్ళిపోయా అని చెప్పింది.
అయితే తన తల్లి ఫోన్ చేశాక మళ్ళీ ఇంటికి వచ్చా అని ఆ తరవాత మూడు నెలలకు ఒక రోజు ఉదయం 3గంటలకు తనకి సడెన్ గా మెలుకువ వచ్చిందని చెప్పింది. అదే రోజున మళ్ళీ 6గంటలకు లేచేసరికి తాను ప్రేమించిన అబ్బాయి చనిపోయాడనే వార్త వినిపించింది బోరున ఏడ్చింది. ఇప్పటికీ ఎప్పటికీ అతడిని మర్చిపోలేను అంటూ సిరి కన్నీళ్లు పెట్టోకోవడం అందరినీ కలచివేసింది. ఎప్పుడూ హుషారుగా కనిపించే సిరి నవ్వుల వెనక ఇంత విషాదం ఉందా అని అంతా అనుకున్నారు.