Bigg Boss 5 Telugu: మిస్ ఫైర్ అయినా పూరి టాస్క్ ! నార్త్ ఇండియన్.. సౌత్ ఇండియన్ అంటూ గొడవ..

-

Bigg Boss 5 Telugu: బుల్లితెర ప్రేక్ష‌కులను అమితంగా ఆక‌ట్టుకుంటున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో..బిగ్ బాస్ తెలుగు 5. గొడవలు, ఏడుపులు, అరుపులతో కావాల్సినంత ర‌చ్చ చేస్తూ.. నానా హంగామా క్రియేట్ చేస్తారు బిగ్ బాస్ కంటెస్టెంట్లు. టైటిల్ రేసులో ఏ ఒక‌రం త‌గ్గేదేలే అన్న‌ట్టు గా వ్యవహరిస్తున్నారు. ఇక శనివారం వీకెండ్ ఎపిసోడ్ చాలా ర‌స‌వ‌త్త‌రంగా సాగింది. కింగ్ నాగ్ వ‌చ్చి శుక్రవారం హౌజ్‌లో ఏం జ‌రిగిందో చూపించాడు.

ఇదిలా ఉంటే.. సన్నీ ఫ్ర‌స్ట్రేష‌న్ స‌న్నీది. జైలులో ఉన్న స‌న్నీ.. జేస్సీ మీద చాలా కోపంగా ఉన్నాడు. సంచాలకుడు జెస్సీని సమర్ధిస్తే తాను ఒప్పుకోననీ, ఈ విష‌యం నాగ్ సార్ వచ్చి చెప్పినా .. జెస్సీ త‌ప్పు చేశాడ‌నే చెప్తాను. జెస్సీని కొట్టాలనే ఇన్‌టెన్షన్‌లో త‌న‌కు లేద‌ని తాను కేవ‌లం బ్యాగ్‌ని మాత్ర‌మే తన్నలేదని చెప్పాడు సన్నీ.

కాస్త హీట్ గా ఉన్న హౌస్ ను కూల్ చేయాల‌ని బిగ్ బాస్ ఓ ఫ‌న్నీ టాక్ ఇచ్చాడు. అది కాస్త మిస్ ఫైర్ కావ‌డంతో హౌస్ లో చిన్న‌పాటి యుద్ద‌మే జ‌రిగింది. పూరీ టాస్క్ లో భాగంగా ఇంటి స‌భ్యుల‌కి ఇచ్చి రెండు గ్రూపులుగా విడ‌గొట్టారు బిగ్ బాస్. ఆనీ, శ్రీరామ్, లోబో, విశ్వ, రవి, శ్రీరామ్‌లు ఒక టీం ఉండ‌గా.. జెస్సీ, కాజల్, ప్రియాంక, మానస్, సిరి లు మరో టీంలో ఉన్నారు. ఈ టాస్క్ కి సంచాల‌కుడిగా ష‌న్నుఉన్నారు.
టాస్క్ లో ఎవ‌రైతే 50 పూరీలు చేస్తే వారే విజేత‌లు అని బిగ్ బాస్ అన్నాడు.కాజల్ టీం సభ్యులు తొందరగా కంప్లీట్ చేశారు. అయితే పర్ఫెక్ట్ మేకింగ్ అంటూ ఆనీ మాస్టర్ టీంని విజేతగా ప్రకటించాడు షణ్ముఖ్.

ఇక అక్క‌డ అస‌లు గొడ‌వ స్టార్ అయ్యింది. జైలు లో ఉన్న స‌న్నీ ష‌న్ను జ‌డ్జిమెంట్ ను త‌ప్పుత‌ట్టారు. రూల్ బుక్ ప్ర‌కారం.. ఫాస్ట్‌గా చేసిన వాళ్లే విజేత అని చెప్పారు కదా.. సరిగ్గా చదువుకోవచ్చు కదా అని షణ్ముఖ్‌కి చెప్పాడు. దీంతో ఆనీ మాస్టర్‌కి బీపీ సర్రున లేచింది. స‌న్నీపై ఉవ్వెత్తున ఎగిసి ప‌డింది.
వాళ్లు కష్టపడి చేస్తే మేం ఆడుకుంటూ చేశామా? అంటూ సన్నీ దగ్గరకు వెళ్లి.. ఆగ్ర‌హం వ్య‌క్తంచేసింది.

మాస్ట‌ర్ కి తెలుగు సరిగా అర్థం కాలేదు అనుకుంటా తెలుగు నేర్పీయండి అని ఆనీ మాస్ట‌ర్ కి పంచ్ వేశారు సన్నీ. దీంతో ఆనీ మాస్ట‌ర్ .. నాకు తెలుగు వచ్చు.. నేను తెలుగు ఇండస్ట్రీలోనే వర్క్ చేస్తున్నా.. అని చెప్పింది. నార్త్ ఇండియాలో చపాతీ ఫేమస్ మాస్టర్ అని సన్నీ అంటే.. నేను నార్త్ ఇండియానా? నేను నార్త్ ఇండియ‌నా ? నేను పుట్టింది తెలంగాణలోనే.. నేను ఇండియ‌న్ అని గ‌ట్టిగా అరిసింది ఆనీ. దీంతో స‌న్నీకి మ‌రింత ఆగ్ర‌హాం వ‌చ్చింది. నార్త్ ఇండియా సౌత్ ఇండియా అని పాయింట్‌ని లేవనెత్తి ఫేమస్ అవ్వాలని అనుకోకండీ.. నార్త్ ఇండియాలో చపాతీ ఫాస్ట్‌గా చేస్తారని అంటే తప్పేంటి? నేను మాట్లాడిన దాన్ని ఎక్కడికో లింక్ చేస్తారేంటి? నేను ఇండియా కాదా? నన్ను బ్లేమ్ చేయడానికి ఈ పాయింట్ మాట్లాడుతున్నారా? అంటూ సన్నీ గ‌ట్టిగా కౌంటర్ ఇచ్చాడు. నువ్ మాట్లాడటం తప్పే.. నేను ఇండియా అంటూ ఆనీ మాస్టర్ పున‌కంతో ఊగిపోయింది. మొత్తంగా ఈ ఇష్యూపై ఇంటి సభ్యులంతా రెండు గ్రూప్‌లుగా విడిపోయి దూషించుకోవడం మొదలుపెట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version