Bigg Boss 5: న‌ట‌రాజ్ మాస్ట‌ర్ అవుట్! ఎలిమినేషన్ కి కారణమ‌దేనా?

-

Bigg Boss 5: బిగ్ బాస్ సీజన్ 5 విజ‌యవంతంగా సాగుతుంది. నాలుగు వారాలు పూర్తి చేసుకున్న ఈ షో నాల్గో ఎలిమినేషన్ సిద్ద‌మైంది. అయితే ఈ వారం ఎవ‌రూ ఎలిమినేట్ అవుతున్నార‌నేది చాలా ఉత్కంఠగా మారింది. ఈవారం నామినేషన్స్‌లో మొత్తం 8 మంది కంటెస్టెంట్స్.. నటరాజ్ మాస్టర్, ఆనీ మాస్టర్, లోబో, ప్రియ, యాంకర్ రవి, సిరి, సన్నీ, కాజల్.. లు ఉన్నారు. కాగా, వీరిలో రవి, సన్నీ, ప్రియ, సిరిలని సేఫ్ చేశారు బిగ్ బాస్‌. ఇంక‌ మిగిలిన నలుగురిని అలాగే నామినేషన్స్ లో ఉంచారు.

ఈ నేప‌థ్యంలో ఓ ప్ర‌ముఖ వెబ్ సైట్ నిర్వ‌హించిన స‌ర్వే నిర్వ‌హించింది. ఈ స‌ర్వే ప్ర‌కారం .. నటరాజ్ మాస్టర్, ఆనీ మాస్టర్, లోబోల మధ్య టఫ్ వార్ కొన‌సాగుతున్న‌ట్టు తెలుస్తుంది. వీరిలో నటరాజ్ మాస్టర్ , అనీమాస్టర్ మాత్రం ముందు వ‌ర‌స‌లో ఉండి.. మోస్ట్ డేంజర్ జోన్ లోనే ఉన్నట్లు తెలుస్తుంది.

వీరి త‌ర్వ‌త లోబో కూడా డేంజర్ జోన్ లో ఉన్నాడు. గత వారం ప్రియపై నోరు పారేసుకోవ‌డం. ఆమెతో మిస్ బిహేవ్ చేయ‌డంతో లోబోపై ప్రేక్షకులు కోపంగా ఉన్నట్లు తెలుస్తుంది. కానీ, లోబో హౌస్ నుంచి పోతే ఎంటర్ టైన్మెంట్ మిస్ అవుతుంది. దీంతో లోబోని మరికొన్ని వారాలు ఉంచితే బాగుంటుందని, లోబో ఉంటే.. షో కు టీఆర్పీ కూడా పెరిగే అవకాశం ఉంది. సో లోబో కూడా సేఫ్‌.

ఇక అనీ మాస్ట‌ర్‌.. ఇక వరుసగా హౌస్ లో నుంచీ ఫిమేల్ కంటెస్టెంట్స్ బయటకి రావడం కూడా ఆటతీరుని ప్రశ్నించేలాగానే ఉంది. అందుకే, అనీమాస్టర్ ని కూడా సేఫ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక మిగిలింది నటరాజ్ మాస్టర్. స‌ర్వే ప్ర‌కారం చూస్తే.. నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అవుతాడని ఎక్కువమంది ఓట్లు వేశారు. దీంతో న‌ట‌రాజ్ మాస్ట‌ర్ క‌చ్చితంగా ఎలిమినేట్ అయ్యేలా క‌నిపిస్తుంది.

అయితే .. హౌస్ లో నటరాజ్ మాస్టర్ ప్ర‌వ‌ర్త‌న వింతగా ఉంది. నేను మోనార్క్‌ని, నేను సింహాన్ని లాంటి వాడిని అంటూ పిచ్చి డైలాగ్‌లు వేయడం. కంటెస్టెంట్ల‌ను జంతువులు పేరు పెట్టి పిలువ‌డం. ఆయన వింత వైఖరి వివాదాస్పదంగా మారింది. ఇవే న‌ట‌రాజ్ మాస్ట‌ర్ ఎలిమినేషన్‌కి కారణాలుగా చెప్పొచ్చు.

అయితే ఈవారంలో ఇంటి సభ్యులంతా సన్నీని టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. అతనికి కెప్టెన్సీ రాకుండా
అడ్డుకున్నారు. కానీ, ప్రేక్షకులు మాత్రం సన్నీకి స‌పోర్టుగా నిలువ‌డం విశేషం. మ‌రో వైపు యాంకర్ రవి గ్రాఫ్ ప‌డిపోయిన‌ట్టు తెలుస్తుంది. లహరి ఇష్యూలో రవి ఇమేజ్ డ్యామేజ్ అయిన‌ట్టు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version