బిగ్ బాస్ సీజన్ 6 చివరి దశకు చేరుకుంది. ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 6 లో ఇప్పుడు 6 మంది టైటిల్ విన్నర్ కోసం పోటీ పడుతున్నారు. మొత్తానికైతే ప్రైజ్ మనీ ఇప్పుడు రూ.50 లక్షల కు చేరింది. శనివారం జరిగిన ఎపిసోడ్ లో నాగార్జున ప్రైజ్ మనీ గెస్సింగ్ విషయంలో ఆడిన ఒక డ్రామా అయితే స్క్రిప్ట్ తరహాలోనే అనిపించింది.మొన్నటి వరకు ప్రైజ్ మనీని రూ.47 లక్షల వరకు లాక్కొచ్చిన కంటెస్టెంట్లు.. ఇప్పుడు మరో రూ.3 లక్షలు కలిపి రూ.50 లక్షలు చేసేసారు. రెండు సూట్ కేసులను పట్టుకొని ఒకదాంట్లో రూ.3 లక్షలు ఉన్నాయని.. కంటెస్టెంట్స్ ఏదో కరెక్ట్ గా గెస్ చేస్తే అది అందులో యాడ్ అవుతుందని తెలిపారు. ఇక ఎడమవైపు ఉన్నదని కంటెస్టెంట్ లు అందరూ కరెక్టుగా గెస్ చేయడంతో ప్రస్తుతం ప్రైజ్ మనీ ఇప్పుడు రూ.50 లక్షలకు సెట్ అయింది.
బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయితే రూ.50 లక్షల ప్రైజ్ మనీ ఎవరు గెలుచుకుంటారు అనే విషయంలో బిగ్ బాస్ మరింత క్యూరియాసిటీ క్రియేట్ చేశాడు. విన్నర్ అయితే దాదాపు ఫైనల్ అయ్యాడు అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి . మరి ఈ విషయంలో బిగ్ బాస్ ఎలాంటి ట్విస్ట్ ఇస్తాడు అనేది ప్రస్తుతం సందేహంగా మారింది. ఇదిలా ఉండగా రూ.50 లక్షల ప్రైజ్ మనీతో పాటు రూ.25 లక్షల విలువ చేసే సువర్ణభూమి ప్లాట్ కూడా విన్నర్ కు అందజేయనున్నాడు బిగ్ బాస్.
అంతేకాకుండా ఇప్పుడు మరో ఖరీదైన గిఫ్ట్ ను కూడా ప్రకటించారు. రూ.75 లక్షలు విలువచేసే జాక్పాట్ అయితే ఇప్పటివరకు అందుకోబోతున్నారని వార్తలు వినిపించాయి. అయితే శనివారం ఎపిసోడ్లో మరొక అదిరిపోయే గిఫ్ట్ కూడా రాబోతున్నట్లు క్లారిటీ ఇచ్చాడు బిగ్ బాస్ విన్నర్ గా గెలిచిన వారికి ఈసారి మారుతి సుజుకి బ్రీజా కారు కూడా ఇవ్వబోతున్నట్టు స్టేజిపై ప్రకటించారు . మరి ఈ ఖరీదైన కారును, ఆ రూ.75 లక్షల ప్రైజ్ మనీ ఎవరు సొంతం చేసుకుంటారో చూడాలి.