బీఆర్ఎస్ పార్టీతో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని చూస్తున్న కేసీఆర్..తెలంగాణలోనే కాకుండా…ఇతర రాష్ట్రాల్లో కూడా బీఆర్ఎస్ బలం పెంచాలని చూస్తున్నారు. అయితే ఒక్కసారిగా అన్నిరాష్ట్రాల్లో కాకుండా..తెలుగు ప్రజలు ఎక్కువ ఉన్న రాష్ట్రాలపై ఫోకస్ చేస్తున్నారు. అందులో మొదటగా ఏపీపై ఎక్కువ ఫోకస్ చేస్తారని తెలుస్తోంది. అటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రాల్లో కూడా బీఆర్ఎస్‌ని విస్తరించనున్నారు.
అయితే ఏపీపై ఎక్కువ ఫోకస్ పెట్టి పనిచేయాలని కేసీఆర్ చూస్తున్నారు..కాకపోతే అక్కడ రాజకీయంగా స్పేస్ లేదు..వైసీపీ-టీడీపీ-జనసేన పార్టీలు ఉన్నాయి. ఆ మూడు పార్టీల మధ్య వార్ నడుస్తోంది. ప్రధానంగా వైసీపీ-టీడీపీల మధ్య రాజకీయ యుద్ధం జరుగుతుంది. ఇక జనసేన వల్ల ఓట్ల చీలిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఏపీలోకి ఎంటర్ కానుంది. ఇప్పటికే ఏపీలో కొందరు కేసీఆర్ అభిమానులు..బిఆర్‌ఎస్ పార్టీకి సంబంధించిన హడావిడి చేస్తున్నారు. దీంతో కేసీఆర్ సైతం ఏపీలో బిఆర్‌ఎస్ శాఖని మొదలుపెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు.
అక్కడ కొందరు నేతలకు కీలక బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నారు. ఇతర పార్టీల్లో ఉన్న నేతలని లాగి బిఆర్‌ఎస్ విస్తరణని చేయాలని చూస్తున్నారు. అయితే ఒక్కసారిగా అక్కడ విస్తరణ చేయడం కుదరని పని..అందుకే మొదట తన స్నేహితుడైన జగన్‌కు సపోర్ట్ గా ఉండాలని భావిస్తున్నారట. ఒకవేళ జగన్..బీజేపీకి దగ్గరగా ఉంటే అప్పుడు కేసీఆర్ నిర్ణయం మారే అవకాశాలు ఉన్నాయి. లేదంటే జగన్‌తో కలిసి ముందుకెళ్లాలని కేసీఆర్ చూస్తున్నారట.
ఇక కేసీఆర్ ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి…అక్కడ కూడా బీజేపీనే టార్గెట్ చేయనున్నారు. ఇప్పటికే ఏపీకి విభజన హామీలని అమలు చేయట్లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్, కడప స్టీల్ ప్లాంట్ ఇతర అంశాలపై పోరాటం చేసే ఛాన్స్ ఉంది. వీటిపై వైసీపీ గాని, టీడీపీ-జనసేనలు సైతం కేంద్రంపై పోరాటం చేయట్లేదు. ఈ తరుణంలో బిఆర్‌ఎస్ పార్టీ వాటిపై పోరాడితే ప్రజల మద్ధతు పెరిగే ఛాన్స్ ఉంది..అదే సమయంలో ప్రతిపక్షాలుగా ఉన్న టీడీపీ-జనసేనలకు ఇబ్బంది. ఒకవేళ బిఆర్‌ఎస్ పార్టీ బలంగాని పెరిగితే..ఆటోమేటిక్ గా చంద్రబాబు, పవన్‌లకు రిస్క్ పెరుగుతుందని విశ్లేషణలు వస్తున్నాయి.
అయితే ఇదంతా జరగాలంటే చాలా టైమ్ ఉంది..అసలు బిఆర్‌ఎస్ పార్టీ ఏపీలోకి రావాలి..అక్కడ ప్రజలు అటు వైపు చూడాలి. కానీ ఉద్యమ సమయంలో ఏపీని ఉద్దేశించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఎవరు మరిచిపోరు. కాబట్టి ఈజీగా బిఆర్‌ఎస్ పార్టీని ఏపీ ప్రజలు ఆదరించడం కష్టమే.