రేవంత్ ఇంట సంబరాలు.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అన్విత

-

బిగ్బాస్ తెలుగు 6వ సీజన్ తోని దశకు చేరుకుంటుంది. ఫైనల్స్ కు మరో మూడు వారాల సమయం మాత్రమే ఉండడంతో ఎవరు కూడా తగ్గకుండా గేమ్ ప్లాన్స్ ను ఫాలో అవుతున్నారు. ఇక తాజాగా జరిగే ఎపిసోడ్ లో టికెట్ టు ఫినాలే టాస్క్ పెట్టి ఒకరిని డైరెక్ట్ గా ఫినాలేకు పంపనున్నాడు బిగ్ బాస్.

ఇదిలా ఉంటే బిగ్బాస్ తెలుగు 6 సీజన్ లోకి టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగాడు సింగర్ రేవంత్. తాజాగా రేవంత్ సతీమణి అన్విత పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈరోజు తెల్లవారుజామున అన్విత ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు రేవంత్ సన్నిహితులు. మరి బిగ్ బాస్ హౌస్ లో ఉన్న రేవంత్ కు ఈ విషయాన్ని చెప్పి బిగ్ బాస్ హ్యాపీ చేస్తాడేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version