ఆధార్ కి ఫోన్ నెంబర్ లింక్ చెయ్యలేదా..? అయితే ఇలా ఈజీగా లింక్ చెయ్యచ్చు..!

-

మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు కూడా ఒకటి. ఆధార్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆధార్ మనకి చాలా అవసరం. ఆధార్ కార్డు వలన చాలా ఉపయోగాలు వున్నాయి. స్కీమ్స్ మొదలు ఎన్నో వాటికి పక్కా ఆధార్ కార్డు ఉండాలి. అయితే ప్రతీ ఒక్కరు ఆధార్ నెంబర్ ని మొబైల్ తో లింక్ చేసుకోవాలి. ఎప్పటి నుండో ఈ విషయాన్ని చెబుతున్నారు.

ప్రతీ ఒక్కరు ఆధార్ కార్డుకు ఫోన్ నెంబ‌ర్‌ను లింక్ చేసుకోవాల్సిన అవ‌సరం తప్పక వుంది. ఇక దీని కోసం పూర్తి వివరాలను చూస్తే.. మనం చేసే పనులు ఆధార్‌కు లింక్ ఉన్న ఫోన్ నెంబ‌ర్‌కు వ‌చ్చే ఓటీపీ బట్టీ జరుగుతూ ఉంటాయి. ఇదిలా ఉంటే గతం లో అయితే ఆధార్ తీసుకున్న వారికి ఫోన్ నెంబ‌ర్‌లు లింక్ చేయ‌కుండానే కార్డుని ఇచ్చేసారు. దీనితో సమస్యలు వస్తున్నాయి. ఇక ఎలా మనం లింక్ చేయాలి అనేది తెలుసుకుందాం.

మీ ఆధార్ కార్డు ఫోన్ తో లింక్ అవ్వనట్టైతే.. ముందు మీరు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంట‌ర్ లేదా ఆధార్ సెంటర్ కి వెళ్ళండి.
ఎమ్ఆధార్ యాప్ ద్వారా మీరు మీ దగ్గర లో వుండే ఆధార్ ఎన్‌రోల్ మెంట్ సెంట‌ర్ల‌ను చూడచ్చు. లేదంటే 1947 టోల్‌ఫ్రీ నెంబ‌ర్‌కు కాల్ చేయండి.
బ‌యోమెట్రిక్ అథెంటికేష‌న్ కోసం తప్పక ఆధార్ కేంద్రానికి వెళ్ళాలి.
ఆన్లైన్ లో చేసుకోవడం కుదరదు.
ఇప్పుడు మీరు ఫార్మ్ ని నింపాల్సి వుంది. వివరాలని ఇచ్చేసి రూ. 50 ఫీజు అందిస్తే చాలు. లింక్ అయ్యిపోతుంది.
ఇది అయ్యాక మీ మొబైల్ నంబర్‌ను మీ ఆధార్‌తో నమోదు చేసుకున్నాక .. మీరు ఆధార్ OTPలను అందుకుంటారు.
UIDAI యొక్క టోల్-ఫ్రీ నంబర్ 1947కి కాల్ చేసి స్టేటస్ ని చూడచ్చు.

లింక్ అయ్యిందో లేదో ఇలా చూడండి:

UIDAI అధికారిక వెబ్‌సైట్‌ లోకి మొదట వెళ్ళండి.
‘మై ఆధార్‌’పై నొక్కండి. రిజిస్టర్ మొబైల్ లేదా ఇమెయిల్ ఐడీని ‘ధృవీకరించు’ మీద నొక్కండి.
ఇప్పుడు మీరు ధృవీకరించాలనుకునే ఆధార్ నంబర్ లేదా మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ IDని ఎంటర్ చేసేయండి.
క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసేయండి.
ఇప్పుడు సెండ్ OTPపై క్లిక్ చేయండి.
ఒకవేళ కనుక లింక్ అయ్యిందంటే మీరు నమోదు చేసిన మొబైల్ ఇప్పటికే మా రికార్డ్‌లతో ధృవీకరించబడింది అని వస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version