బిగ్ బాస్: ఆరియానా గేమ్ ప్లాన్ మారింది.. అతనితో స్నేహం అందుకే?

-

ఈ రోజు బిగ్ బాస్ ఎపిసోడ్ లో డీల్ కుదుర్చుకునే టాస్కుని ఇచ్చారు. తమ దగ్గర ఉన్న బంగారు నాణేలతో బిగ్ బాస్ తో డీల్ కుదుర్చుకుని, చివర్లో ఎవరి దగ్గరైతే తక్కువ నాణేలు ఉంటాయో వారు గెలిచినట్టు లెక్క అని చెప్పారు. గత సీజన్లో నామినేషన్స్ కోసం జరిగిన త్యాగాల టాస్కే ఇక్కడ డీల్స్ రూపంలో జరుగుతుంది. మొదటి డీల్ లో భాగంగా కుమార్ సాయి తన ఒంటిమీద బట్టల్నికత్తిరించేసాడు. అలాగే హారిక జుట్టు కత్తిరించుకుంది. ఇలా ఒక్కొక్కరూ ఒక్కో డీల్ చేసుకుంటూ వస్తున్నారు.

ఐతే ఈ డీల్ కుదుర్చుకోవడానికి గంట మోగించాల్సి ఉంటుంది. రెండు టీమ్ ల నుండి ఇద్దరు వ్యక్తులు ఎవరు ముందుగా గంట మోగిస్తారో వారే డీల్ చేసుకోవాలి. ఇక్కడ రెడ్ టీమ్ నుండి గంట మోగించడానికి వచ్చిన ఆరియానా కొద్దిగా అతిగా ప్రవర్తించిందేమో చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. అఖిల్ కి దక్కకుండా తాను గంట కొట్టినందుకు ఆమె అరిచిన అరుపు హౌస్ మొత్తం ప్రతిధ్వనించిందనే చెప్పాలి. గత రెండు మూడు రోజులుగా ఆరియానా అరవడం ఎక్కువే చేసింది.

అదొక్కటే కాదు అభిజిత్ తో స్నేహంగా ఉంటుంది. గతంలో వీరిద్దరికీ అస్సలు పడేది కాదు. అలాంటిది ఇప్పుడు అభిజిత్ అంటూ అతని పక్కనే తిరుగుతూ కనిపిస్తుంది.అంతకుముందు అవినాష్ నామ జపం జపించిన ఆరియానా ఇప్పుడు అభిజిత్ తో స్నేహం చేయడం కొంచెం వింతగా అనిపించినా గేమ్ ప్లాన్ లో భాగంగానే ఇలా చేస్తుందని చాలామంది ఫీల్ అవుతున్నారు. ఈ వారం ఆరియానా నామినేషన్స్ లో ఉంది.

అభిజిత్ కూడా ఉన్నాడు. గత కొన్ని వారాలుగా అభిజిత్ ఉంటూ వస్తున్నాడు. ఇలా ప్రతీసారీ సేవ్ అవుతూ వస్తున్నాడంటే బయట ఫాలోయింగ్ బాగానే పెరిగి ఉంటుందనే ఉద్దేశ్యంతోనే ఆరియానా స్నేహం చేస్తుందని చెబుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే అభిజిత్ తో స్నేహంగా ఉండే మరో కంటెస్టెంట్ హారిక ఇంటి నుండి బయటకి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చూడాలి మరేం జరుగుతుందో..!

Read more RELATED
Recommended to you

Latest news