బిగ్ బాస్: నామినేషన్స్ లో రచ్చ రచ్చ.. ఎలిమినేషన్ టఫ్ గా ఉండనుంది.

-

ప్రతీ సోమవారం హౌస్ అంతా ఎవరో నిప్పులు పోసినట్లుగా తయారవుతుంది. ఆ నిప్పుల కుంపటి మెల్లమెల్లగా తగ్గుతున్నట్లుగా ఆదివారం వచ్చేసరికి పూర్తిగా చల్లారిపోతుంది. ఎప్పటిలాగే ఇప్పుడు కూడా నామినేషన్స్ లో రచ్చ రచ్చ జరిగింది. ఒకరి మీద ఒకరు నువ్వలా అంటే నువ్విలా అనుకుంటూ వాదోపవాదాలు చేసుకున్నారు. ముఖ్యంగా అభిజిత్, అఖిల్, సోహైల్ ల మధ్య జరిగిన చర్చ ఆసక్తిగా మారింది.

ఈ ముగ్గురి మధ్య గొడవ తరచూ జరుగుతూనే ఉంది. ఐతే గొడవ జరిగినప్పుడల్లా మధ్యలో మరో వ్యక్తిని లాగడం కామన్ అయిపోయింది. ఇప్పుడు కూడా అంతే నామినేట్ చేయడానికి కారణాలు చెప్పాల్సి వచ్చినపుడు ఇతరుల గురించి తీయడం వల్ల అసలు వాళ్ళని వాళ్ళు ఎందుకు నామినేట్ చేసుకున్నారో అర్థం కాకుండా పోయింది. ఇద్దరు మాట్లాడుకుంటే తన పేరెందుకు తీస్తున్నారంటూ మోనాల్ పెట్టిన ఏడుపులు, నేను తీయలేదు అఖిలే తీసాడంటూ అభిజిత్ కంప్లైంట్లు.. నామినేట్ చేసి మరీ అమ్మ రాజశేఖర్ కాళ్ల మీద పడిన నోయల్ అతి, ఆగని సోహైల్ కోపం, మధ్యలో దివి పోట్లాట.. అన్నీ కలిపి సోమవారం ఆసక్తితో పాటు ప్రేక్షకులకి చిరాకు కూడా తెప్పించాయి.

ఐతే ఏది ఏమైనా నామినేషన్స్ లోకి వచ్చిన వారందరూ టఫ్ కంటెస్టెంట్సే. అఖిల్, సోహైల్, అభిజిత్, మోనాల్, లాస్య, అరియానా, అమ్మ రాజశేఖర్, నోయల్.. వీరందరూ హౌస్ లో ఆక్టివ్ కంటెస్టెంట్లుగా ఉన్నారు. అంటే ఈ సారి ఎలిమినేషన్ చాలా టఫ్ గా ఉండనుందని తెలుస్తుంది. మరి వీరిలో హౌస్ నుండి బయటకు వెళ్ళేదెవరో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version