టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ గా పేరు పొందిన జోడి ఎవరంటే దీప్తి సునైనా, షణ్ముఖ అని చెప్పవచ్చు. ఇక వీరిద్దరూ పలు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇంస్టాగ్రామ్ ద్వారా ఎన్నో వీడియోలను చేసి బాగా పాపులర్ అయ్యారు. కానీ బిగ్ బాస్ లో పాల్గొనడం వల్ల ఈ జోడి విడిపోవడం జరిగింది. బిగ్ బాస్ లో సిరితో షణ్ముఖ చాలా చనువుగా ఉండడంతో దీప్తి సునైనా షణ్ముఖ బ్రేకప్ చెప్పుకోవడంతో ఎవరు కూడా ఊహించని స్థాయిలో షాక్ అయ్యారు.
దీప్తి సునైనా, షణ్ముఖ కలుస్తారని వారి అభిమానులు కూడా ఆశించారు… కానీ వారు అనుకున్నట్లుగా జరగలేదు. బిగ్ బాస్ షో అయిపోయిన తర్వాత కొంతకాలం చాలా సైలెంట్ గా ఉంది సునైనా..షణ్ముఖ తాజాగా ఆహ లో స్ట్రిమింగ్ కాబోతున్న ఒక వెబ్ సిరీస్ లో నటించారు. ఏజెంట్ ఆనంద్ సంతోష్ అనే పేరుతో ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించడం జరిగింది. ఇక షణ్ముఖ నటించిన పలు వెబ్ సిరీస్ కూడా మంచి వ్యూస్ ను రాబడుతున్నారు.