బిగ్ బాస్: జాక్ పాట్ కొట్టిన ఫైమా .. ఎంత పారితోషకం అంటే..?

-

పటాస్ షో ద్వారా కెరియర్ను మొదలుపెట్టిన ఫైమా ఆ తర్వాత జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. జబర్దస్త్ లో ఈమె చేసే కామెడీ మాత్రమే కాదు ఈమె చేసే స్టంట్ లు కూడా అప్పుడప్పుడు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఈమెకు విపరీతమైన ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది. అలా జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ ద్వారా విపరీతమైన అభిమానులు ఉన్నారు. ఈ క్రేజీ కారణంగానే ఈమెకు ఇటీవల బిగ్ బాస్ ఆరవ సీజన్లో పార్టిసిపెంట్ చేయడానికి అవకాశం లభించింది. ప్రస్తుతం బిగ్ బాస్ 13వ వారానికి చేరుకున్న విషయం తెలిసిందే. అయితే ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే విషయంలో మాత్రం కొంత సస్పెన్స్ కొనసాగింది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. జబర్దస్త్ లేడీ కమెడియన్ ఫైమా ఎలిమినేట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే 13 వారాలకు గాను భారీ స్థాయిలో పారితోషకం అందుకుంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈమె వారానికి 25 వేల రూపాయలను అందుకున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఇప్పటివరకు 13 వారాలకు గాన 3 లక్షల 25 వేల రూపాయలను దక్కించుకున్నట్లు సమాచారం. ఒకరకంగా చెప్పాలి అంటే ఫైమాకు ఇది మంచి రెమ్యునరేషన్ అని తెలుస్తోంది .ఏది ఏమైనా ఈ రేంజ్ లో పారితోషకం ఇప్పుడున్న వారికి ఎవరికీ వచ్చింది లేదు.

ప్రస్తుతం ఆమెకు ఎక్కువ స్థాయిలో రెమ్యునరేషన్ రావడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్లు కూడా తెలుస్తోంది. ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా వచ్చిన క్రేజ్ తో ఫైమా తన తదుపరి కెరియర్ ను ఎలా సెట్ చేసుకుంటుందో అని వార్తలు వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version