బిగ్‌బాస్ సీజన్-8 ఫస్ట్ వీక్ నామినేషన్ ప్రాసెస్ అంతా అరుపులు, గొడవతోనే సాగింది. సోనియా,ప్రేరణతో పాటు మిగిలిన కంటెస్టెంట్ల గొడవలు, వాదనలు ఏదో కావాలని జనాలా అటెన్షన్ గ్రాబ్ చేయడానికి క్రియేట్ చేసినట్టుగా ఉన్నాయి కానీ నేచురల్‌గా లేవని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.నామినేషన్స్‌లో సోనియా ప్రతి మాటకు ఇతరులతో గొడవలు పడటం, గొంతు చించుకొని అరవడం కామెడీగా ఉంది.ఆమెకు నిఖిల్‌తో పాటు మిగిలిన వాళ్లు సర్ధిచెప్పడానికి ప్రయత్నించిన వినడం లేదు.
ఇక నైనిక, నబీల్, బేబక్కతో పాటు మరికొందరి వాదనలు ఓవర్‌యాక్టింగ్‌గా ఉన్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.సోది మరి ఎక్కువైపోయిందని అంటున్నారు.రెండో రోజే గొడవలు ఇలా ఉంటే మున్ముందు ఎలా ఉంటదో అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఇక విష్ణుప్రియ, అభయ్ నవీన్ గేమ్‌ను ఎలా మొదలుపెట్టాలో తెలియక ఏదో వాగుతున్నారు.ఇప్పుడు కెప్టెన్ పోస్ట్‌ను చీఫ్స్ మార్చడంతో ఫస్ట్ వీక్ చీఫ్స్‌గా ఉన్న నిఖిల్, నైనిక, యష్మిగౌడలకు నామినేషన్స్ నుంచి మినహాయింపు దక్కింది.
అయితే, ఈవారం బేబక్క ఎలిమినేషన్ అయ్యే చాన్సెస్ కనిపిస్తున్నాయి. లిస్టులో బేబక్క, మణికంఠ, పృథ్వీరాజ్, సోనియా, విష్ణుప్రియ, శేఖర్ భాషా పేర్లు ఉండగా, బేబక్క బిగ్‌బాస్- 8 నుంచి ముందుగా వెళ్లే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.