తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా విపరీతంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ వర్షాల దెబ్బకు ఖమ్మం, ఉమ్మడి నల్గొండ అలాగే వరంగల్ జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలో వరదలు బీభత్సం సృష్టించాయి. ఇండ్లల్లోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో జనాలంతా నిరాశ్రయులయ్యారు. అయితే కొంతమంది… ఇంటి పత్రాలు అలాగే, సర్టిఫికెట్లు కూడా పూర్తిగా నానిపోయాయి. దీనికి సంబంధించిన ఒక ఫోటో అందరినీ.. భావోద్వాగానికి గురిచేస్తోంది.
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తొగరాయి గ్రామంలో వరదలో తడిచిన విలువైన పత్రాలను ఓ మహిళ ఆరబెడుతోంది. శైలజ అనే మహిళకు సంబంధించిన సర్టిఫికెట్లు అన్నీ పూర్తిగా నానిపోయాయి. దీంతో ఆ సర్టిఫికెట్లను ఎండలో నానబెట్టి… ఆందోళన చెందుతోంది. అయితే దెబ్బతిన్న ఆ పత్రాల స్థానంలో కొత్త పత్రాలను కూడా ఇవ్వాలని కలెక్టర్ ను డిమాండ్ చేస్తున్నారు శైలజ తో పాటు ఇతర బాధితులు.