బిగ్ బాస్: ఇండియాకు రావడం వెనుక ఇంత కథ ఉందా..?

-

బుల్లితెరపై బిగ్ బాస్ ప్రేక్షకుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇది మొదట 2018లో మొదలైన బిగ్ బాస్ అప్పటి నుంచి ఇప్పటివరకు బాగానే నెట్టుకొస్తోందని చెప్పవచ్చు. అయితే మొదట హిందీలోనే బిగ్ బాస్ మొదలై మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అయితే నిజానికి మన ఇండియాకి బిగ్ బాస్ వచ్చింది మాత్రం 2006 వ సంవత్సరంలో. ఇందుకు ముఖ్య కారణం హీరోయిన్ శిల్పా శెట్టి అన్నట్లుగా సమాచారం.

ఇక హిందీలో బిగ్ బాస్ మొదలుకావడానికి ముందే బిగ్ బ్రదర్ అని ఒక పేరుతో డచ్ లో ఈ షో ప్రారంభమైంది. దీనిని 1999లో డచ్ భాషలో జాన్ డిమాల్ అనే ఒక జూనియర్ వ్యక్తి ప్రారంభించారట. దీనికి దర్శకత్వం వహించినది మాత్రం టామ్ సిక్స్ అనే వ్యక్తి అన్నట్లుగా సమాచారం. ఇందులో శిల్పా శెట్టి పాల్గొని 2005 సీజన్ కి విజయవంతంగా నిలిచింది. ఇలాంటి షో హిందీలో ప్రారంభిస్తే బాగుంటుంది అని హిందీ ప్రేక్షకులకు ఐడియా రావడం జరిగిందట. అలాంటి ఐడియా తోనే మొట్టమొదటిసారిగా 2006లో ఇండియాలో ఎన్డోల్ షైన్ వారు లాంచ్ చేయడం జరిగింది.ఆ తర్వాత హిందీ బిగ్ బాస్ షో కి వస్తున్న ఆదరణ చూసి మిగతా భాషలలో కూడా ఈ షో ని మొదలుపెట్టడం ప్రారంభించారు.


ఇక్కడ తరువాత తెలుగు, తమిళ్ ,కన్నడ వంటి భాషలలో కూడా ఈ షో మొదలు కావడం జరిగింది. ఇండియాలో ప్రస్తుతం ఏకంగా తొమ్మిది భాషలలో ఈ రియాలిటీ షో నడుస్తున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 600 షోస్ తో ప్రసారం కానున్నట్లుగా సమాచారం. అయితే ఈ షో మొదలైనప్పటినుంచి తెలుగులో మాత్రం ఎన్నో కాంట్రవర్సీలకు దారితీస్తోంది. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఉండే నటీనటుల రెమ్యునరేషన్ ,క్యాస్టింగ్ కౌచ్, టిఆర్పి రేటింగ్ తదితర అంశాలు కూడా వార్తల్లో నిలుస్తూ ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version