బిగ్ బాస్: నన్ను ముట్టుకుంటే తట్టుకోలేను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రీ సత్య..!

-

బిగ్ బాస్ సీజన్ 6 ప్రసారం అయి వారం రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పుడు రెండవ వారంలో కంటెస్టెంట్లు తమ టాలెంట్ ను నిరూపించుకోవడానికి సాయశక్తులా పోరాడుతున్నారు. ఇకపోతే రెండవ వారంలోకి అడుగుపెట్టిన హౌస్ మేట్స్ తమ క్యారెక్టర్ల గురించి చెప్పుకుంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఇక అంతే కాదు నామినేషన్ రోజు శ్రీ సత్య చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. ఇకపోతే అసలు ఏం జరిగింది అనే విషయానికి వస్తే.. అర్జున్ కళ్యాణ్, శ్రీ సత్య , రేవంత్ ఇంకా శ్రీహాన్లు మార్నింగ్ సాంగ్ అయిపోగానే సోఫాలో కూర్చుని డిస్కషన్ మొదలుపెట్టారు. అక్కడే రేవంత్ కి మరొకసారి చాలా గట్టిగా జోకులు వేయద్దని, నాపైన అసలు వేయొద్దని స్ట్రిక్ట్ గా చెప్పాడు అర్జున్..

ఇక అంతేకాదు రేవంత్..అర్జున్ కి శ్రీ సత్య , కీర్తి చెల్లెలు అనేసరికి అనుభూతిని తీసుకోలేకపోయాడు.. తనకు ఆ ఫీలింగ్ ఉన్నా కూడా అన్నయ్య అని పిలవద్దు అంటూ అర్జున్ తెలిపాడు. ఇక రేవంత్ తో చాలాసేపు ఆర్గ్యుమెంట్ చేశాడు. ఎంతసేపటికి రేవంత్ వినిపించుకోకపోయేసరికి అర్జున్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే శ్రీ సత్య ఇక్కడే కామెంట్లు చేసింది . హౌస్ లో ఎవరైనా సరే తనకు అన్నయ్యలే అంటూ చెప్పేసింది… ఇకపోతే శ్రీహాన్.. మార్నింగ్ నిన్ను టచ్ చేసినప్పుడు ఫీల్ అయ్యావు కదా అందుకే అర్జున్ వెళ్ళిపోయాడు అంటూ తెలిపాడు. దీనికి శ్రీ సత్య నన్ను టచ్ చేస్తే నాకు ప్రాబ్లం.. నాకు నచ్చిన వాళ్ళు అయితే ఓకే కానీ.. ఎవరు పడితే వాళ్ళు నా ఒంటి మీద చేయి వేస్తే నాకు నచ్చదు అంటూ తెలిపింది..

ఇక భుజాలపైన, సైడ్ హగ్ వరకు ఓకే కాని అది కూడా నేను కంఫర్ట్ గా ఫీల్ అయితేనే.. లేదంటే అసలు ముట్టుకోనివ్వను అంటూ డైలాగ్స్ కొట్టింది శ్రీ సత్య. అయితే ఈ మాటలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. నెటిజన్స్ కూడా తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news