Bigg Boss 5: టెన్ష‌న్.. టెన్ష‌న్.. నామినేషన్ లిస్ట్ లీక్‌! ఈ సారి టార్గెట్ అత‌డేనా!!

-

Bigg Boss 5: తెలుగు బుల్లి తెర ప్రేక్ష‌కుల మ‌దిని దోచుకున్న షో బిగ్ బాస్‌. టెలివిజ‌న్ చ‌రిత్ర‌లో కనీవినీ ఎరుగని రీతిలో ప్రేక్ష‌క‌ ఆధర‌ణ పొందుతున్న నెంబర్ వన్ రియాలిటీ షోగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఫ‌న్నీ టాస్కులు, అరుపులు, గొడవలు, ఏడుపులు, ఫైటింగులు, రొమాన్స్, ల‌వ్ సోర్టీలు ఇలా ఎన్నో రకాలుగా చూపిస్తూ.. విజ‌యవంతంగా దూసుక‌పోతుంది.

ఇప్ప‌టికే ఈ సీజ‌న్ స‌క్సెస్ పుల్ గా మూడువారాల్లో ముగ్గురు కంటెస్టెంట్ల‌ను ఎలిమినేట్ చేసింది. ఈ షోలో ప్ర‌ధాన ఘ‌ట్టం నామినేష‌న్స్‌.. ఈ క్రమంలోనే సోమవారం ప్రసారం కానున్న నామినేషన్స్ టాస్క్ వివరాలు లీకయ్యాయి. ఈ వారం ఎవరెవరు నామినేట్ అయితారో ఓ లూక్ వేద్దాం ప‌దండి!

బిస్ బాస్ సీజ‌న్ 5 చాలా ర‌స‌వ‌త్త‌రంగా సాగుతుంది. ముపెన్న‌డూ లేని విధంగా 19 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైనా ఈ షోలో గొడవలు, బూతులు, రొమాన్స్ ల‌తో ఎంట‌ర్టైన్ చేస్తూ.. భారీ రేటింగ్‌తో దూసుక‌పోతుంది. ఇప్పటివ‌ర‌కూ అయిన ఎలిమినేష‌న్‌ల‌ను ప‌రిశీలిస్తే.. మొదటి వారం సరయు రాయ్ రెండో వారంలో సీనియర్ నటి ఉమాదేవి.

ఇక, ఇప్పుడు మూడో వారంలో లహరి షారి ఎలిమినేట్ అయ్యారు. ఎలినేట్ అయిన వారంద‌రిని తొలుత క్యారెట‌ర్ ప్ర‌కారంగా బ్యాడ్ చేస్తాడు. ఇలా మిగితా వారంద‌రిని దృష్టిలో వెస్ట్ అనేలా చేశాడు. టార్గెట్ చేసిన కంటెస్టెంట్ స్కీన్ షేరింగ్ కూడా ఎక్కువ‌గానే ఉంటుంది. ప్ర‌తి చిన్న విష‌యాన్ని నెగిటివ్ గా చూపించే ప్ర‌య‌త్నం చేస్తాడు.

ఇలా వారిని హౌస్ నుంచి ఎలినేట్ చేసి ప్ర‌య‌త్నం చేస్తున్నారు బిగ్ బాస్‌. ఈ నేప‌థ్యంలో ఈ వారం ఎవ‌రెవ‌రూ నామినేట్ అవుతారు? ఈ సారి బిగ్ బాస్ ఎవ‌రిని టార్గెట్ చేస్తారు ? అనేది స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌గా మారింది. ఈ వారం ఎలిమినేష‌న్ లిస్ట్‌లో ఎవ‌రెవ‌రు ఉండబోతున్నారనేది ఆస‌క్తిక‌రంగా మారింది.

మొదటి వారం బిగ్ బాస్ షోలో ఆరుగురు కంటెస్టెంట్లు నామినేట్ అవగా.. రెండో వారం ఏకంగా ఏడుగురు సభ్యులు నామినేట్ అయ్యారు. మూడో వారంలో ఐదుగురు నామినేట్ అయ్యారు. ఈ నేపథ్యంలో నాలుగో వారానికి ఎంత మంది నామినేట్ అవుతారో అనే అంశం ఆస‌క్తిగా మారింది. లీకయినా ఎలిమినేష‌న్ లిస్ట్ ప్ర‌కారం.. ఈ సారి ఎనిమిది మంది నామినేట్ చేస్తున్న‌ట్లు తెలుస్తుంది.

లోబో, ఆర్జే కాజల్, వీజే సన్నీ, సిరి హన్మంత్, ఆనీ మాస్టర్, నటరాజ్ మాస్టర్, ప్రియ, యాంకర్ రవిలు నామినేట్ లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇందులో పలువురు రెండు అంతకంటే ఎక్కువ సార్లు నామినేట్ అయ్యారు. అయితే.. ఈ సారి మాత్రం.. కింగ్ నాగ్ తో యాంక‌ర్ ర‌వికి చీవాట్లు త‌ప్పేట్లు లేవు. ల‌హ‌రి ఎలిమినేష‌న్ ప్రాధానం కార‌ణం ర‌వినేని అంద‌రికి తెలిసిపోయింది. దీంతో రవికి మరో దెబ్బ తగిలినట్లైంది.

గతవారం మారిదిగానే ఈ వారం కూడా నామినేష‌న్ ప్ర‌క్రియ ర‌స‌వ‌త్త‌రంగా జ‌రుగ‌నున్న‌ది. కంటెస్టెంట్ల మధ్య గొడవలు ఓ రేంజ్‌లో జరగబోతున్నాయని తెలుస్తోంది. దీంతో ఈ రోజు ఎపిసోడ్.. ఎంతో ఆసక్తికరంగా
సాగ‌నున్న‌ది. దీంతో ఈరోజు ప్ర‌సారం కాబోయే షో కోసం బిగ్ బాస్ ల‌వ‌ర్స్ ఎంతో ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news