50 లక్షలు గెలిస్తే తల్లిని అవుతా : ప్రియాంక సింగ్

-

బిగ్ బాస్ సీజన్ -5 చివరి దశకు చేరుకుంది. దాంతో ఉత్కంఠ మరింత పెరిగింది. టాప్ 5 లో ఎవరు ఉంటారన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇక బిగ్ బాస్ హౌజ్ నుండి నిన్న జరిగిన ఎలిమినేషన్ లో యాంకర్ రవి ఎలిమినేట్ అయ్యాడు. దాంతో అంతా షాక్ అయ్యారు. ముందు నుండి సేవ్ అవుతున్న రవి ఇలా ఎలిమినేట్ అవ్వడం ఏంటని కంగు తిన్నారు. సన్నీ దగ్గర ఉన్న ఎవిక్షన్ పాస్ ను ఉపయోగించి కాజల్ ను సేవ్ చేయగా….రవికి ఓటింగ్ తక్కువ పడింది అంటూ నాగ్ రవి ఎలిమినేషన్ ను ప్రకటించాడు.

ఇదిలా ఉండగా ఎలిమినేషన్ కు ముందు మీరు 50లక్షలు గెలిస్తే ఏం చేస్తారు. అంటూ ప్రశ్నించగా ఒక్కొక్కరూ ఒక్కో ఆన్సర్ ఇచ్చారు. ట్రాన్స్ వుమెన్ ప్రియాంక సింగ్ కూడా ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చింది. తనకు తల్లి కావాలని ఎంతో ఆశగా ఉందని చెప్పింది. అందుకోసం ఎవరిని అయినా దత్తత తీసుకుంటా అని కానీ కనీస బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటేనే దత్తత ఇస్తారని చెప్పింది.కాబట్టి గెలిచిన డబ్బు అందుకు వాడుకుంటా అని అదే విధంగా పేరెంట్స్ కు కూడా కొంత ఇస్తానని చెప్పింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version