బిగ్ బాస్ 7: 12 మంది హౌస్ మేట్స్ ను ఆడుకున్న “రతిక రాజ్” !

-

తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 లో మొత్తం 14 మంది సభ్యులు ఎంటర్ అయ్యారు.. అయితే ఈసారి సీరియల్ నటీనటులు ఎక్కువ అయిపోయారు. ఇక శివాజీ ఒక్కడే చాలా మందికి తెలిసిన మొఖం కావడంతో ప్రేక్షకులు చాలా నిరాశతోనే ఈ సీజన్ ను తిలకిస్తున్నారు. ఇప్పటికి ఒక వారం పూర్తి అయ్యి కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయిపోయింది. ఈ వారం ఎలిమినేషన్ అయ్యే వారిలో షకీలా మరియు టేస్టీ తేజ పేర్లు ఎక్కువగా వినబడుతున్నా, షకీలా ఎలిమినేట్ అవుతుందని తెలుస్తోంది. కాగా నిన్న రాత్రి జరిగిన ఎపిసోడ్ లో అస్త్ర లు గెలుచుకున్న అమరదీప్ టీం లో వారిని ఓడిపోయిన గౌతమ్ టీం లో ఒక్కక్కరు ఒకరి దగ్గర ఉన్న అస్త్రను అదే టీం లో మరొకరికి ఇవ్వాలన్న బిగ్ బాస్ నిబంధనతో చేస్తూ వచ్చారు. కానీ నాలుగవ ప్లేస్ దగ్గరకు వచ్చే సరికి గౌతమ్ టీం అంతా రతికను పంపాలని నిర్ణయించుకున్నా .. అందుకు రతికా ఒప్పుకోకపోవడంతో హౌస్ అంతా పూర్తి నిరాశలో మునిగిపోయింది. ఎవ్వరు చెబుతున్నా ఆమె వినకుండా మూర్ఖంగా ప్రవర్తించడంతో అందరూ ఆమెపై ఆవేశంతో ఊగిపోయారు..

ముఖ్యంగా రతిక – దామిని మధ్యన గొడవ, రతిక – గౌతమ్ మధ్యన గొడవ మరియు సందీప్ రతిక ల మధ్యన ఆఖర్లో అమర్ డీప్ అందరిమీద నిరాశతో ఆవేశపడడం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు అని చెప్పాలి. మొత్తానికి .. హౌస్ లో ఉన్న 12 మంది చెబుతున్నా వినకుండా రతిక అందరి ఓపికను పరీక్షించి బసు పాలైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version