కారు దిగుడు..హస్తం పట్టుడు.!

-

తెలంగాణలో అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీలో నాయకులకు కొదవ లేదనే చెప్పాలి. ఇప్పటికే బి‌ఆర్‌ఎస్ నేతలే కాకుండా..టి‌డి‌పి, కాంగ్రెస్ ల నుంచి వచ్చిన నేతలతో ఫుల్ గా ఉంది. ఇంకా చెప్పాలంటే ఓవర్ ఫ్లో అయింది. అందుకే ఈ సారి ఎన్నికల్లో సీట్లు ఆశించి..దక్కని వారు తప్పనిసరి పరిస్తితుల్లో బి‌ఆర్‌ఎస్ పార్టీని వదిలేసి వెళ్లాలని చూస్తున్నారు. అంటే సీటు దక్కని వారే బి‌ఆర్‌ఎస్ నుంచి జంప్ అయిపోతున్నారు.

ఇక బి‌ఆర్‌ఎస్ తర్వాత తెలంగాణలో బలంగా ఉంది కాంగ్రెస్ పార్టీ. అందుకే ఆ పార్టీలోకి బి‌ఆర్‌ఎస్ నేతలు వలస వెళుతున్నారు. అది కూడా కాంగ్రెస్ లో సీటు హామీ దక్కితేనే వెళుతున్నారు. ఇప్పటికే పలువుర్ కీలక నేతలు బి‌ఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి జంప్ చేశారు. ఇప్పుడు మరింత మంది రెడీ అయ్యారని తెలుస్తోంది. సెప్టెంబర్ 17న హైదరాబాద్ లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అధ్యక్షతన భారీ సభ జరగనుంది. ఆ సభలో భారీ స్థాయిలో బి‌ఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరనున్నారని తెలుస్తోంది.

ఇటీవలే సీటు దక్కక వేముల వీరేశం, ఆరేపల్లి మోహన్ లాంటి వారు బి‌ఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నేతి విద్యాసాగర్ రావు, ఎమ్మెల్యే రేఖా నాయక్, నల్లాల ఓదెలు లాంటి వారు కూడా బి‌ఆర్‌ఎస్‌కు గుడ్ బై చెప్పడం ఖాయంగా కనిపిస్తోంది. అటు మైనంపల్లి హనుమంతరావు అంశంపై ట్విస్ట్‌లు కొనసాగుతున్నాయి. ఆయన బి‌ఆర్‌ఎస్ లో ఉంటారో, కాంగ్రెస్ లోకి వస్తారో క్లారిటీ లేదు. అటు కే‌సి‌ఆర్ సన్నిహితుడు కూచాడి శ్రీహరి రావు సైతం సీటు దక్కకపోవడంతో బి‌ఆర్‌ఎస్‌కు రాజీనామా చేస్తున్నారు.

ఇలా కీలక నేతలంతా బి‌ఆర్‌ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ లోకి వస్తున్నారు. మరి ఇలా పార్టీ మారడం వల్ల బి‌ఆర్‌ఎస్‌కు ఎంత నష్టం..కాంగ్రెస్ ఏం లాభం వస్తుందో ఎన్నికల సమయంలో తేలనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version