హౌస్ లో 12 వ రోజు అలా సరదాగా గడిచిపోతుండగా… బిగ్ బాస్ లగ్జరీ బడ్జెట్ కోసం మరో టాస్క్ ఇస్తాడు. ఎవరైనా ముగ్గురు ఇంటి సభ్యులు గార్డెన్ ఏరియాలో ఉన్న బట్టలను ఉతకాలని చెబుతారు.
బిగ్ బాస్ తెలుగు ఎపిసోడ్ 13 మాత్రం కొంచెం భావోద్వేగంగా జరిగిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే.. ఇంటి సభ్యులంతా కలిసి ప్రేక్షకులను ఏడిపించారు. ఇంటి సభ్యుల ఒక్కొక్కరి గతాన్ని విని ఇంటి సభ్యులే కాదు ప్రేక్షకులు కూడా భావోద్వేగానికి గురయి ఉంటారు. అంతలా ఏమోషన్ అవుతూ ఇంటి సభ్యులు తమ గతాన్ని, చేదు అనుభవాలను హౌస్ లో పంచుకున్నారు.
ఈ ఎపిసోడ్ లో మాత్రం అదే హైలెట్. హౌస్ లో 12 వ రోజు అలా సరదాగా గడిచిపోతుండగా… బిగ్ బాస్ లగ్జరీ బడ్జెట్ కోసం మరో టాస్క్ ఇస్తాడు. ఎవరైనా ముగ్గురు ఇంటి సభ్యులు గార్డెన్ ఏరియాలో ఉన్న బట్టలను ఉతకాలని చెబుతారు. దాని కోసం ఉపయోగించే సబ్బుల్లో గోల్డ్, సిల్వర్ కాయిన్స్ ఉంటాయి. బట్టలు ఉతుకుతుండగా… సబ్బుల్లో వచ్చే గోల్డ్, సిల్వర్ కాయిన్స్ ను తీసి సపరేట్ గా బౌల్ లో వేయాలి.
బిగ్ బాస్ ఇచ్చిన సమయం వరకు ఎన్ని కాయిన్స్ తీస్తారో అన్ని పాయింట్స్ వరకు మాత్రమే ఇంటి సభ్యులు లగ్జరీ బడ్జెట్ ను ఉపయోగించగలుగుతారు. సో.. ఆ ముగ్గురు బట్టలు ఉతికి 3350 కాయిన్స్ సంపాదిస్తారు.
దీంతో 3350 పాయింట్ల వరకు ఉపయోగించుకునేలా లగ్జరీ బడ్జెట్ కోసం బిగ్ బాస్ అనుమతిస్తాడు. లగ్జరీ బడ్జెట్ కు కావాల్సిన సరుకులను ఇంటి సభ్యులు తీసుకుంటారు. అయితే… బజర్ మోగిన తర్వాత కూడా లగ్జరీ బడ్జెట్ లో మార్పులు చేయడంతో బిగ్ బాస్ ఇంటి సభ్యులకు వార్నింగ్ ఇస్తాడు.
ఇక… తర్వాత బిగ్ బాస్ ఇంటి సభ్యులకు మరో టాస్క్ ఇస్తాడు. తమ జీవితంలో జరిగిన చేదు అనుభవాలను ఇంటి సభ్యులతో పంచుకోవాలని చెబుతాడు.
అయితే… శ్రీముఖి, రవి, శివజ్యోతి మాత్రం ఇంటి సభ్యులనే కాదు.. బిగ్ బాస్ అభిమానులను, ప్రేక్షకులను కూడా ఏడిపిస్తారు. మిగితా ఇంటి సభ్యులు కూడా వాళ్ల గతాన్ని తవ్వి తీసి తమ మనసులోని బాధను పంచుకున్నారు. అలా… బిగ్ బాస్ హౌస్ లో 12వ రోజు గడిచిపోయింది.