ఇంటిలోని సభ్యుల్లో ఇద్దరిద్దరిని పిలిచి వాళ్లలో ఎవరో ఒకరు మాత్రమే నామినేషన్లలో ఉంటారని.. నామినేషన్లలో ఎవరు ఉండాలో ఇద్దరు సభ్యులు తేల్చుకోవాలని బిగ్ బాస్ కోరుతాడు.
బిగ్ బాస్ ఇంట్లో మరో వారం ప్రారంభమయింది. అంటే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయినట్టే. ఇంటి నుంచి వెళ్లిపోవడానికి నామినేషన్ ప్రక్రియను నిన్నటి ఎపిసోడ్ లోనే బిగ్ బాస్ పూర్తి చేశారు. అయితే.. ఈసారి కూడా నామినేషన్ల ప్రక్రియ సరికొత్తగా జరిగింది.
ఇంటిలోని సభ్యుల్లో ఇద్దరిద్దరిని పిలిచి వాళ్లలో ఎవరో ఒకరు మాత్రమే నామినేషన్లలో ఉంటారని.. నామినేషన్లలో ఎవరు ఉండాలో ఇద్దరు సభ్యులు తేల్చుకోవాలని బిగ్ బాస్ కోరుతాడు. అయితే… టాస్క్ లో చేసిన తప్పిదం కారణంగా శ్రీముఖి ముందే నామినేట్ అయింది. వాళ్ల సీక్రెట్ టాస్క్ ను సక్సెస్ ఫుల్ గా చేసి పునర్నవి, అలీ ఇమ్యూనిటీ పవర్ ను పొంది ఈసారి నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యారు.
దీంతో బిగ్ బాస్ ముందుగా వితిక, రవి.. ఇద్దరిని కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచాడు. ఇద్దరిలో ఎవరు ఇంటి నుంచి వెళ్లిపోవడానికి నామినేట్ అవుతారో బిగ్ బాస్ చెప్పాలంటాడు. ఇద్దరు డిస్కస్ చేసుకున్న తర్వాత రవి నామినేట్ అవ్వడానికి సిద్ధపడతాడు.
ఆ తర్వాత బిగ్ బాస్ శివజ్యోతి, రోహిణిని పిలుస్తాడు. వాళ్లలో ముందుగా శివజ్యోతి నామినేట్ అవుతుంది. అయితే బయటికి వచ్చాక.. వాళ్లిద్దరూ నామినేషన్ల గురించి డిస్కస్ చేసుకోవడంతో బిగ్ బాస్ శివజ్యోతి, రోహిణిని ఈ వారం, వచ్చే వారం డైరెక్ట్ గా నామినేట్ చేస్తాడు.
ఆతర్వాత మహేశ్, వరుణ్.. ఇద్దరిలో వరుణ్ నామినేట్ అవుతాడు. బాబా భాస్కర్, అషు.. ఇద్దరిలో బాబా భాస్కర్ నామినేట్ అవుతాడు. అషు కూడా బాబా భాస్కర్ నే నామినేట్ చేస్తుంది. దీంతో బాబా భాస్కర్ షాక్ అవుతాడు. కిచెన్ టీమ్ విషయంలో బాబా భాస్కర్ చెప్పిన విషయం కొందరు సభ్యులకు నచ్చకపోవడంతో అషు… బాబాను నామినేట్ చేయాలనుకున్నట్టు బిగ్ బాస్ కు చెప్పింది.
హిమజ, రాహుల్ ఇద్దరిలో రాహుల్ నామినేట్ అయ్యాడు. అలా రవి, శివజ్యోతి, వరుణ్, బాబా భాస్కర్, రాహుల్, రోహిణి, శ్రీముఖి ఈ వారం బిగ్ బాస్ ఇంటి నుంచి వెళ్లిపోయేందుకు నామినేట్ అయ్యారు.