బిగ్ బాస్ విన్నర్ ఎవరో తేలిపోయింది… ఎవరంటే ?

-

ఎట్టకేలకి తెలుగు బిగ్ బాస్ 4 తుది అంకానికి చేరింది. ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుండి మెగా మారధాన్ ఫినాలే ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఇక ఎప్పటి లాగే ఈ షోకి సంబందించిన లీకేజీలు బయటకు వచ్చేశాయి. ఆ లీకేజీల ప్రకారం ఈ ఏడాది విన్నర్ గా అభిజిత్ నిలిచాడు. ఇక రన్నర్ గా సోహైల్ నిలిచాడు. అలానే అఖిల్ మూడవ స్థానంలో నిలిచాడు.

ఇక హౌస్ లో ఉన్న ఇద్దరు అమ్మాయిలు ఎలిమినిట్ అయ్యారని టాక్. ఇక ఈ ఎపిసోడ్ కోసం ముందు నుండీ చిరంజీవి ఛీఫ్ గెస్ట్ గా వస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. మరి ఎవరు వస్తారు అనేది మాత్రం ఇప్పటికీ ఒక సస్పెన్స్ గానే మారింది. అయితే ఇది బిగ్ బాస్ కావడంతో ఎప్పుడు ఏ నిముషాన ఏమయినా జరిగే అవకాశం ఉంది. సో ఈ లీకేజ్ లిస్టు కూడా నిజమని నమ్మలేం. చూద్దాం ఏమవుతుందో ?

Read more RELATED
Recommended to you

Exit mobile version