Bigg Boss: ఆడ‌పిల్లగా మారిన విష‌యం తెలుసుకున్న పింకీ తండ్రి.. క‌న్నీటి ప‌ర్యంత‌మైన ఇంటి స‌భ్యులు

-

Bigg Boss: బిగ్ బాస్ హౌస్‌ అన్ని రకాల ఎమోషన్స్ కి కేరాఫ్ అడ్ర‌స్‌. జీవితంలో ఎదురయ్యే ప్ర‌తి ఎమోష‌న్‌ను ఎక్క‌డో ఓ చోట టచ్ చేస్తూ ముందుకు సాగుతుంది. ఈ షో ప్రారంభ‌మైనా తొలి వారాల్లో చాలా మందికి నెగిటివ్ ఓపినియ‌న్ ఉండేది. కేవ‌లం తిట్టుకోవ‌డం.. అన‌వ‌స‌ర గొడ‌వ‌లు, కోపాలు, ఇగోలు చూపిస్తున్నారు. ఈ ప్రోగామ్ వేస్ట్ రా బాబు అని కామెంట్లు చేశారు. అలాంటి కామెంట్లను తిప్పికొట్టారు నిర్వ‌హ‌కులు. అన్ని ర‌కాల ఎమోష‌న్స్ హైలెట్ చేస్తూ.. రికార్డు స్థాయి రేటింగ్ తో దూసుక‌పోతుంది బిగ్ బాస్ షో.

ఈ క్ర‌మంలో హ‌ర్ట్ కు టచ్ అయ్యేలా టాస్కులు పెడుతూ బుల్లి తెర ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యింది. కొన్ని సార్లు కంటెస్టెంట్ల జీవితంలోని క‌న్నీటి గాధల‌ను వెలికి తీసి.. ప్రేక్ష‌కుల‌ గుండెలు బ‌రువెక్కించాడు బిగ్ బాస్. మాట‌ల‌తో వ్య‌క్త‌ప‌ర్చ‌లేని గాధ ప్రియాంక సింగ్ ది.

జ‌బ‌ర్ద‌స్త్ కామెడియన్ గుర్తింపు పొందిన సాయితేజ‌.. లింగమార్పిడి చేయించుకుని ప్రియాంక సింగ్‌గా మారిన విష‌యం తెలిసిందే. అయితే .. తాను ఆడ‌పిల్ల‌గా మారిన విష‌యం ఇంకా తన నాన్నకి తెలియదని, ఆయనకు తెలిస్తే రియాక్షన్‌ ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే తట్టుకోలేకపోతున్నానని, ఈ విష‌యాన్ని పలుమార్లు షోలో ప్ర‌స్త‌వించింది ప్రియాంక సింగ్.

ఈ నేపథ్యంలో గురువారం ఎపిసోడ్‌లో ప్రియాంక తండ్రికి అసలు నిజం తెలిసినట్లు కుడా అర్థమవుతోంది. ప్రియాంక తండ్రి మాట్లాడించిన‌ట్టు షో క‌నిపించింది. పింకీ తండ్రి తొలుత.. బాబూ సాయితేజ్‌ అంటూ పిలవడంతో ప్రియాంక కన్నీరు మున్నీరయ్యింది. సాయి తేజ.. నువ్వు అబ్బాయి అయినా.. అమ్మాయి అయినా సర్వం నువ్వే నాన్నా అన్న‌డంతో భావోద్వేగానికి గుర‌య్యింది పింకీ. ఒక్క‌సారిగా.. టీవీ ద‌గ్గ‌ర‌కి వెళ్లి కన్నీరు పెట్టుకుంది.

అబ్బాయిగా మారినంత మాత్ర‌నా ఆదరించడం మా నేస్తమా అని ఎప్పుడు అనుకోవద్దు. మేము నీ తల్లిదండ్రులం అని చెబుతారు. పింకీ తండ్రి మాటాలు విన్న ఇంటి స‌భ్యులు ఒక్కసారిగా ఎమోషనల్ గా చప్పట్లు కొడతారు. గ‌త జీవితపు జ్క్షాప‌కాల‌ను గుర్తు చేసుకుంటూ.. కన్నీరు పెట్టుకుంది. సొంత ఇంటికి వెళ్ళడానికి కూడా ఏదో ఒక దొంగ లాగా వెళ్లాన‌ని, తాను వెళ్లేది పక్కంటి వాళ్ల కూడా తెలియదని ఏడుస్తూ చెప్పింది.

అమ్మాయిగా మార‌డానికి అంగీక‌రించ‌డంతో త‌న సంతోషానికి అవ‌ధులేకుండా పోయింది.
త‌న తండ్రి ఇంటికి రమ్మన్న‌డంటూ చెప్పుతూ.. ఎంతో ఎమోషన్ అయ్యింది. ఆ త‌రువాత‌.. ప్రియాంక కి చీర కుంకుమ పూలు గాజులు పెట్టారు. హౌస్ మెంట్స్ కూడా పింకీకి మద్దతుగా నిలిచారు. ఈ క్ర‌మంలో ప్రియ, మానస్ కాళ్ళు కూడా మొక్కింది. ఇక చివరగా మా నాన్నను గట్టిగా పట్టుకొని ఏడువాల‌ని ఉందని ఐ లవ్యు ఐ లవ్యూ నాన్నా అని గట్టిగా ఏడుస్తూ చెప్పింది. ఇప్పుడూ ఈ ప్రోమో వైర‌ల్ అవుతుంది. ఈ రోజు షో ఏవిధంగా ఉంటుందో అని ఆసక్తిని రేకెత్తిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version