టి‌డి‌పి ని ఇలా కూడా ఉంచేలా లేరుగా….!

-

నలభై ఏళ్ల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీని ప్రత్యర్ధులే కాదు….సొంత పార్టీ నేతలే నాశనం చేసేలా ఉన్నారు. అసలు ప్రత్యర్ధులు కంటే ముందు గానే పార్టీని భూ స్థాపితం చేసేలా ఉన్నారు. ఇప్పటికే టి‌డి‌పి పరిస్తితి ఎలా ఉందో అందరికీ తెలుసు. ముఖ్యంగా చంద్రబాబు వల్ల తెలంగాణలో పార్టీ ఎత్తిపోయింది. సరే ఏపీలో అయిన పార్టీ ఉందనుకుంటే….దాన్ని కూడా నాశనం పట్టించారు. బాబు….ఆయన చుట్టూ ఉన్న భజన బృందం ఎంత నాశనం చేయాలో అంత చేసింది.

TDP Party | తెలుగుదేశం పార్టీ

2019 ఎన్నికల్లో జగన్ గాలి కంటే…బాబు తప్పిదాల వల్లే ఎక్కువ పార్టీ నష్టపోయింది. సరే ఓడిపోయాకైనా మారాలి కదా…అది లేదు ఇంకా పార్టీని పాతాళానికి తోక్కేసాలా కనిపిస్తున్నారు. పార్టీలో తప్పులున్నాయని విమర్శలు చేసే నాయకులని పక్కనబెట్టి…తనకు భజన చేస్తూ, జగన్‌ని ఇష్టారాజ్యంగా తిట్టే నేతలని బాబు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అందుకే పార్టీ ఇంకా పికప్ కాలేకపోతుంది.

బాబుతో సహ టి‌డి‌పి నేతలు….పార్టీని ఎలా బలోపేతం చేయాలనే విషయాన్ని వదిలేసి జగన్‌ని ఎలా తిట్టాలనే దానిపై దృష్టి పెట్టారు. ఇంకా ఇదే పనిలో ఉంటే టి‌డి‌పి ఎందుకు బలపడుతుంది. అలాగే దిగజారిపోయి ఉంది. అయినా సరే మనోళ్ళు తగ్గాలి కదా…అసలు తగ్గడం లేదు ప్రతిదానికి జగన్‌పై విమర్శలు చేయడమే. అసలు డ్రగ్స్ విషయంలో తెగ రచ్చ చేస్తున్నారు. జగనే డ్రగ్స్ అమ్ముతున్నారని పనికిమాలిన విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా పట్టాభి….ఈయన కేవలం టి‌డి‌పిని నాశనం చేయడానికే ఉన్నట్లున్నారని సొంత పార్టీ వాళ్లే మాట్లాడుకునే పరిస్తితి.

డ్రగ్స్‌కు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయని అంటారు? కాకినాడ ఓడరేవులో ఒక బోటు కాలిపోతే అందులో డ్రగ్స్ ఉన్నాయని మాట్లాడుతారు. అందుకే అక్కడ మత్య్సకారులు తిరగబడే పరిస్తితి వచ్చింది. తమ బోటుల్లో డ్రగ్స్ తెస్తున్నామని చెప్పి మత్స్యకారులని అవమానించారని చెప్పి..ఆ వర్గం ప్రజలు పట్టాభితో సహ ఇతర టి‌డి‌పి నేతలపై దాడి చేసే పరిస్తితి వచ్చింది. చంద్రబాబు క్షమాపణ చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తామని అంటున్నారు.

అసలు పట్టాభి లాంటి వారు ఏదో పొడిచేద్దామని ఇంకా ఏదో చేసి టి‌డి‌పికి పెద్ద బొక్క పెట్టేలా ఉన్నారు…మళ్ళీ దీనికి బాబు వత్తాసు. అందుకే జనం తిరగబడే పరిస్తితి వచ్చింది. ఇప్పటికైనా బాబు మారి, పార్టీ నేతలని కాస్త మారిస్తే బెటర్…లేదంటే టి‌డి‌పి పరిస్తితి ఇంకా దిగజారిపోతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version