Bigg Boss Telugu 3 Episode 11: వరుణ్, తమన్నాను జైల్ లో పెట్టిన బిగ్ బాస్..!

-

గ్యాస్, నీళ్లు, హౌస్ యాక్సెస్ కోసం సైకిళ్లు తొక్కకుండా వాటిని తీసేయాలంటే మరో మూడు టాస్కులు చేయాలని బిగ్ బాస్ ఇంటి సభ్యులకు తెలిపారు. మొదటి టాస్క్ హౌస్ యాక్సెస్ సైకిల్ ను తీసేయడం కోసం ఇంటి సభ్యుల్లో ఎవరో ఒకరు టాస్క్ కోసం రావాలని కోరగా… అందరు కలిసి మహేశ్ విట్టాను టాస్క్ కోసం ఎంపిక చేస్తారు.

బిగ్ బాస్ అప్పుడే 11 ఎపిసోడ్ లను పూర్తి చేసుకున్నది. ఇంట్లో 10 రోజులు పూర్తయ్యాయి. అయితే.. ఈసీజన్ ప్రారంభం అయిన కొన్ని రోజుల వరకు సప్పసప్పగా ఉన్న ఎపిసోడ్ లు.. ఆ తర్వాత రక్తి కట్టడం ప్రారంభించాయి. ఇంటి సభ్యులు కూడా గరం గరంగా ఉండటంతో బిగ్ బాస్ హౌస్ లో గొడవలు ప్రారంభం అయ్యాయి. దీంతో బిగ్ బాస్ ప్రేక్షకులకు ఆసక్తిని క్రియేట్ చేసింది.

ఇక ఈరోజు ఎపిసోడ్ లోకి వెళ్తే.. లగ్జరీ బడ్జెట్ కోసం బిగ్ బాస్ నిన్ననే టాస్క్ ఇచ్చిన సంగతి తెలిసిందే. గ్యాస్, నీళ్లు, హౌస్ యాక్సెస్ కోసం మూడు సైకిళ్లను నిరంతరాయంగా తొక్కుతూనే ఉండాలని బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఆదేశించడంతో… వంతుల వారీగా.. ఏది అవసరం అయినప్పుడు దాన్ని తొక్కారు ఇంటి సభ్యులు. ఆ టాస్క్ లోనూ కొందరు ఇంటి సభ్యుల మధ్య గొడవలు జరిగాయి.

గ్యాస్, నీళ్లు, హౌస్ యాక్సెస్ కోసం సైకిళ్లు తొక్కకుండా వాటిని తీసేయాలంటే మరో మూడు టాస్కులు చేయాలని బిగ్ బాస్ ఇంటి సభ్యులకు తెలిపారు. మొదటి టాస్క్ హౌస్ యాక్సెస్ సైకిల్ ను తీసేయడం కోసం ఇంటి సభ్యుల్లో ఎవరో ఒకరు టాస్క్ కోసం రావాలని కోరగా… అందరు కలిసి మహేశ్ విట్టాను టాస్క్ కోసం ఎంపిక చేస్తారు.

ఆ టాస్క్ లో భాగంగా మహేశ్ విట్టా… గార్డెన్ ఏరియాలో దీపాన్ని పెట్టి.. దాన్ని ఆరిపోకుండా బిగ్ బాస్ ఆదేశాలు వచ్చేంత వరకు కాపాడాలి. ఆ టాస్క్ జరుగుతుండగానే బిగ్ బాస్ గ్యాస్ సైకిల్ ను తీసేయడం కోసం మరో టాస్క్ ఇస్తాడు.

ఈ టాస్క్ కోసం ఇద్దరు ఇంటి సభ్యులు ముందుకు రావాలని కోరుతాడు. ఆ టాస్క్ లో భాగంగా… ఇద్దరు ఇంటి సభ్యులు కలిసి 100 పిడకలను తయారు చేయాలని బిగ్ బాస్ చెబుతాడు. శ్రీముఖి, అలీ రెజా.. ఇద్దరు కలిసి ఆ టాస్క్ ను పూర్తి చేస్తారు. దీంతో ఇంటికి గ్యాస్ సరఫరా నిరంతరాయంగా వస్తుంది.

నీటి సరఫరాకు చెందిన మూడో సైకిల్ ను తీసేయడం కోసం బిగ్ బాస్ మరో టాస్క్ ఇస్తాడు. ఈ టాస్క్ కోసం ఇంటి సభ్యులు వితికను ఎంపిక చేస్తారు. వితిక… ఆక్వేరియంలో ఉన్న చిన్న చిన్న చేపల మధ్యలో ఉన్న కాయిన్స్ ను తీయాలి. బిగ్ బాస్ ఆదేశం వచ్చేవరకు కనీసం 50 కాయిన్స్ ను తీయాలి. అయితే.. వితిక కూడా ఈ టాస్క్ ను విజయవంతంగా పూర్తి చేయడంతో బిగ్ బాస్ నీటి సరఫరాను కూడా నిరంతరాయంగా కొనసాగిస్తాడు.

ఇక… మహేశ్ విట్టా కూడా టాస్క్ ను విజయవంతంగా పూర్తి చేయడంతో.. మూడు టాస్కులు సక్సెస్ ఫుల్ అయ్యాయని బిగ్ బాస్ చెబుతూ.. లగ్జరీ బడ్జెట్ కు ఇంటి సభ్యులు అర్హత సాధించినట్టు బిగ్ బాస్ తెలియజేస్తాడు.

అయితే… లగ్జరీ బడ్జెట్ కోసం పెట్టిన ఈ టాస్కుల్లో అత్యంత చెత్తగా పర్ ఫాం చేసిన ఇద్దరు కుటుంబ సభ్యులను ఎన్నుకోవాలంటూ ఇంటి సభ్యులను బిగ్ బాస్ కోరగా… తమన్నా, వరుణ్ ముందుకొస్తారు. దీంతో ఇద్దరినీ జైల్ లోకి వెళ్లాలని బిగ్ బాస్ ఆదేశిస్తారు. వాళ్లకు నీళ్లు, అన్నం తప్పించి మరేదీ ఇవ్వకూడదని ఇతర సభ్యులను బిగ్ బాస్ ఆదేశిస్తాడు. ఇద్దరూ జైలులోకి వెళ్తారు. తదుపరి బిగ్ బాస్ ఆదేశం వచ్చేదాకా వాళ్లు జైలులోనే గడపాలి. అలా 11వ ఎపిసోడ్ గడిచిపోయింది. చూద్దాం… 12వ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో?

Read more RELATED
Recommended to you

Exit mobile version