బిగ్ బాస్ సీజన్ 5 లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్ ఉమాదేవి ప్రస్తుతం టాప్ సిక్స్ లో ఉన్న వీజే సన్నీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వీజే సన్నీ మరియు ఉమాదేవి బిగ్ బాస్ కు ముందు ఓ సీరియల్ లో కలిసి నటించారు. ఆ సీరియల్ లో సన్నీకి ఉమాదేవి అత్తపాత్రలో నటించింది. అయితే ఉమాదేవికి ఇద్దరు కూతుళ్లు ఉండగా తన పెద్దకుమార్తెను సన్నీకి ఇచ్చి వివాహం చేయానుకున్నట్టు వెల్లడించింది.
సన్నీ తనకు భాగా తెలుసని అతడిని చూసినప్పుడు తన పెద్ద కుమార్తెకు ఇచ్చి వివాహం చేయాలని మనసులో అనుకున్నట్టు తెలిపింది. కానీ అంతలోనే ఒకసారి షూటింగ్ లో కలిసినప్పుడు తన కూతుళ్లు సన్నీని అన్నయ్య అని పిలిచారని చెప్పింది. దాంతో సన్నీ కూడా వాళ్లను పెద్ద చెల్లి చిన్న చెల్లి అనడం మొదలు పెట్టాడని చెప్పింది. ఇదిలా ఉండగా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఉమాదేవి కొన్నివారాల పాటు ప్రేక్షకులను అలరించింది.