ప్రభాస్ సలార్ నుండి అదిరిపోయే అప్డేట్..?

-

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సలార్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా లో ప్రభాస్ కు జోడిగా శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావస్తున్నట్టు తెలుస్తోంది. దాంతో ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సినిమా నుండి ఫ్యాన్స్ కోసం ఓ స్పెషల్ సర్ప్రైజ్ రాబోతున్నట్టు ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది.

అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సినిమా తో దేశ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. కేజీఎఫ్ కు సీక్వెల్ గా వస్తున్న కేజీఎఫ్-2 కూడా త్వరలోనే విడుదల కావాల్సి ఉంది. ఈ సినిమా పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు ప్రభాస్ తో సలార్ సినిమా పూర్తి అవ్వగానే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబోలో సినిమా కూడా ప్రారంభం కానుంది. అంతే కాకుండా ఆ తరవాత బన్నీ తో కూడా ప్రశాంత్ నీల్ ఓ సినిమా ను ప్లాన్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version