“దివి”ని సేఫ్ చేస్తున్న బిగ్‌బాస్‌.. ఓట్లెందుక‌య్యా

-

బిగ్‌బాస్ సీజ‌న్ 4 ప్రారంభ‌మై 5 రోజులు పూర్త‌యింది. తొలి రోజునే ఎలిమినేష‌న్ పెట్టి అంద‌రి చూపు త‌న‌వైపు తిప్పుకున్నాడు బిగ్‌బాస్. ఇక ఎలిమినేష‌న్‌లో హీరో అభిజిత్‌, జోర్‌దార్ సుజాత, సూర్య‌కిర‌ణ్‌, అఖిల్‌, దివి వైద్య‌, మొహ‌బూబ్‌, గంగ‌వ్వ‌లు ఉన్నారు. ఇక హౌస్‌లో అంద‌రూ ఎంతో ఉషారుగా పార్టిసిపేట్ చేస్తుంటే దివి మాత్రం ఏదో మూడీగా ఉంటూ వ‌స్తుంది. అయితే అది కూడా ఆమె గేమ్ ప్లాన్ అయి ఉండ‌వ‌చ్చు. ఎవ్వ‌రితో మాట్లాడ‌కుండా త‌న‌ప‌ని తాను చేసుకుపోతున్న‌ట్లుగా క‌నిపించింది. ఏదిఏమైనా త‌ను మాట్లాడ‌కుండానే అంద‌రి అటెన్ష‌న్ సంపాదించుకుంది. ఓటింగ్ చూస్తే దివి కొంచెం వెన‌క‌బ‌డిన‌ట్లుగా తెలుస్తుంది.

ఇదే విష‌యం షో నిర్వాహ‌కుల దృష్టికి రావ‌డంతో ఆమెను హైలైట్ చెయ్య‌డం మొద‌లు పెట్టారు. గ‌త రెండు రోజులుగా దివికి సంబంధించిన ప్రోమోలు, ఆమెను హైలైట్ అయ్యేలా ఎడిటింగ్ చేశారు. ఇదంతా కావాల‌నే దివిని సేఫ్ చేయ్యాల‌నే ఉద్యేశ్యంగా చేస్తున్న‌ట్లుగా అనిపిస్తుంది.

రెండు రోజుల నుండి గ‌మ‌నిస్తే మాత్రం ఓట్లు ప‌డ్డా ప‌డ‌కున్నా దివి బిగ్‌బాస్ హౌస్‌లో కొన‌సాగిస్తార‌నేది అర్థ‌మ‌వుతుంది. అస‌లు ఈమె విష‌యంలో బిగ్‌బాస్ ఎందుకు అలా చేస్తున్న‌డ‌నే సందేహాలకు జ‌వాబు ఈజీగా దొరికేస్తుంది. దివి, హారిక‌, మోనాల్‌లు హౌస్‌లో ఉంటూ న‌య‌నానందం కలిగించ‌గ‌ల‌ర‌నేది షో నిర్వాహ‌కుల ఆలోచ‌న‌గా అర్థ‌మ‌వుతుంది. నిజ‌మా కాదా అన్న‌ది మీరు గ‌మ‌నిస్తే ఇట్టే అర్థ‌మ‌వుతుంది.

అలాంట‌ప్పుడు ఫ్యాష‌న్ షో ర‌న్ చెయ్యొచ్చుగా ఇలా రియాలిటీ… అంటూ ప‌బ్లిక్‌ని మోసం చెయ్య‌డం దేనికో.. అందాల‌ను ఆస్వాదించాల‌నుకునే వారికి బోలెడు సైట్స్ అందుబాటులో ఉన్నాయి.. ఆ మాత్రం చూడ‌టానికి బిగ్‌బాస్ ఫో ఎందుకో అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజ‌న్స్‌.. ఈ విష‌యం బిగ్‌బాస్ షో నిర్వాహ‌కులు ప‌రిశీలిస్తే ముందు ముందు మంచి షో చూడొచ్చు.. లేకపోతే ఏదో ఫ్యాష‌న్ ఛానెల్ చూసిన ఫీలింగ్ క‌లుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version