మాజీ బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ బీహార్ నుంచి రాజ్యసభ స్థానానికి జరుగుతున్న ఉపఎన్నికకు బీజేపీ అభ్యర్థిగా ఎంపికయ్యారు. లోక్ జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు, కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ మరణం తర్వాత బిహార్ తరపున ఓ రాజ్య సీటు ఖాళీగా ఉంది. బీహార్ శాసనసభలో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్ డి ఎ) కు మెజారిటీ ఉన్నందున మోడీ రాజ్యసభలోకి ప్రవేశించడానికి పెద్దగా అడ్డంకులు లేనట్టే. .
రాష్ట్ర జనతాదళ్ (ఆర్జెడి) నేతృత్వంలోని ప్రత్యర్థి కూటమి పోటీ చేయాలని నిర్ణయించుకుంటే ఈ ఎన్నికలు డిసెంబర్ 14 న జరుగుతాయి. ఇటీవల జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో పార్టీ గెలిచిన తర్వాత బీజేపీకి చెందిన తార్కిషోర్ ప్రసాద్‌ను బీహార్ ఉప ముఖ్యమంత్రిగా చేశారు. నితీష్ కుమార్ నాల్గవసారి ముఖ్యమంత్రి అయ్యారు. జనతాదళ్ యునైటెడ్ (జెడియు) కి నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి నితీష్ తన చిరకాల డిప్యూటీ సీఎం అయిన మోడీని మిస్ అవుతానని చెప్పుకొచ్చారు. ఇక ఆయన్ని డిప్యూటీగా తప్పించిన సమయంలో ఆయన అసంతృప్తికి లోనయ్యారు అనే విషయాన్ని బిజెపి ఖండించింది.