“ట్రంప్”..ఆహ్వానాన్ని తిరస్కరించిన భారత యువ శాస్త్రవేత్త..!!

-

అమెరికాలో చదువుకోవడం అంటేనే ఎగిరి గంతేస్తారు కొందరు భారతీయ యువకులు..ఇక అమెరికాకే అత్యంత ప్రతిష్టాత్మకమైన నాసా లాంటి అంతరిక్ష పరిశోధనా సంస్థలో పనిచేసే అవకాశం వస్తే కళ్ళు గిర్రున తిరుగుతాయి. ఇక అగ్ర రాజ్య అధ్యక్షుడే అమెరికా రమ్మని ప్రత్యేకమైన ఆహ్వానం ఇస్తే బట్టలు అన్నీ సర్దేసుకుని మరీ తుర్రున ఎగిరి పోతారు చాలా మంది కానీ..కొందరిలా ఆ యువకుడు ఆలోచన చేయలేదు..

తనకి జన్మనించిన తలి తండ్రులని, ఈ భారత గడ్డని విడిచి పెట్టి వెళ్ళను గాక వెళ్ళను అంటూ ట్రంప్ ఆహ్వానాన్ని తిరస్కరించాడు..అంతేకాదు నాసా కి రానాని చెప్పేశాడు. నువ్వు పిచివాడివా అంటూ అందరూ తిడుతుంటే అవును నేను భారత దేశాన్ని ప్రేమించేంతటి పిచ్చివాడినే అంటూ బదులు ఇచ్చాడు. అసలు ఇలాంటి యువకులు ఈ రోజుల్లో ఉన్నారా అంటే ఉన్నారనే చెప్పాలి..

 

అతడి పేరు గోపాల్. బీహార్ రాష్ట్రం భాగల్పూర్ జిల్లా ద్రువంగ్జ్ ప్రాంతానికి చెందిన వాడు. ఓ నిరుపేద కుటుంభంలో జన్మించిన అతడు, చదువుల్లో మాత్రం ధనికుడే. అతడి మేధో శక్తిని చూసి స్కూల్ టీచర్స్ ఆశ్చర్య  పోయేవారట. 10th పాస్ అయిన తరువాత అతడు చేసిన ప్రయోగాలు అరటి పండు తో పేపర్ బయో  సెల్స్ కు పేటెంట్ కూడా సాధించాడు. ఇక అతడి ప్రతిభని గుర్తించిన నేషనల్ ఇన్నోవేషన్ సంస్థ ప్రోశ్చాహాన్ని  అందించడంతో  ఇలాంటివి నాలుగు ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యాడట. దాంతో ఇతడి ప్రతిభని తెలుసుకున్న నాసా , ట్రంప్ అమెరికా రమ్మని ఆహ్వానం అందించగా అవేమి తనకి వద్దని భారత దేశ అభివృద్ధికే తన సేవలు అందిస్తానని తేల్చి చెప్పాడట.

 

 

 

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news