గుజరాత్ తీరాన్ని తాకిన ‘బిపోర్ జోయ్’ తుఫాన్‌

-

అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్ జాయ్ తుఫాన్ తీరం దిశగా ప్రయాణం చేస్తూ తీవ్ర నష్టాన్ని సృష్టించబోతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నది. దాదాపు 8 రాష్ట్రాలను ప్రభావితం చేస్తున్న ఈ తుఫాన్ వల్ల చాలా రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో పలు రాష్ట్రాలను అప్రమత్తం చేశారు.గుజరాత్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు.
అత్యంత తీవ్ర తుపాను బిపోర్ జోయ్ గుజరాత్ తీరాన్ని తాకింది.

ప్రస్తుతం ఈ తుపాను గంటకు 15 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోంది. తుపాను ప్రభావంతో గుజరాత్ తీరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉద్ధృతంగా ఈదురుగాలులు వీస్తున్నాయి. అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. తుపాను ప్రభావంతో గంటకు 150 కిమీ వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ పేర్కొంది. ఇప్పటికే తుపాను ప్రభావిత ప్రాంతాల నుంచి 94 వేల మందిని ఖాళీ చేయించారు. ప్రధాని నరేంద్ర మోదీ తుపాను పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version