ప్రతిఫలం ఆశించకుండా పవన్ రాజకీయాల్లోకి వచ్చాడు : నటి ఆమని

-

జనసేనాని పవన్ కల్యాణ్ నిన్న (జూన్ 14) వారాహి యాత్ర షురూ చేసిన సంగతి తెలిసిందే. అన్నవరం సత్యనారాయణస్వామిని దర్శించుకున్న అనంతరం పవన్ తన యాత్రను ప్రారంభించారు. కాగా, అన్నవరం పరిసరాల్లో నారాయణ అండ్ కో చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో సీనియర్ నటి ఆమని ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. నారాయణ అండ్ కో చిత్రబృందం కూడా నిన్ననే అన్నవరం సత్యదేవుని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అన్నవరం ఆలయాన్ని దర్శించుకున్న రోజే పవన్ కళ్యాణ్ అక్కడికి రావడం చాలా సంతోషంగా ఉందని అది గర్వంగా కూడా అనిపిస్తోంది అంటూ ఆమె తెలిపింది. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇక్కడికి వస్తున్నారని తెలిసినప్పుడు సంతోషంతో పాటు గర్వంగా కూడా అనిపించింది.

ఆయన వారాహి విజయయాత్ర ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నారు అని తెలిసినప్పుడు ఇంకా ఆనందం వేసింది అనుకోకుండా ఇక్కడికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సమాజానికి మంచి చేయాలన్న ఆయన ఉన్నత లక్ష్యం కచ్చితంగా ఆయనను ముందుకు తీసుకెళ్తుంది. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి రావడం మరింత ఉత్తమమైన పని ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ప్రజలకు మంచి చేయాలనే తపన ఆయనలో ఎక్కువగా ఉంటుంది. ఆయనలో ఎప్పుడూ కూడా గర్వం ఉట్టిపడదు. ఆయన నిజంగా చాలా గ్రేట్ ఆయన చేసే సేవలకు చేతులెత్తి నమస్కారం పెట్టాలనిపిస్తుంది అంటూ పలు కామెంట్స్ చేసింది ఆమని.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version