చైనాలో కొత్త వైరస్ కలకలం…

-

చైనాలో పురుడు పోసుకున్న కరోనా వైరస్ ప్రపంచాన్ని అన్ని దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే అనేక రూపాలు మార్చుకుని ఆల్ఫా, బీటా, డెల్టా, ఓమిక్రాన్ ఇలా  ప్రజలపై అటాక్ చేస్తోంది. ఇదిలా ఉంటే చైనాలో మరో వైరస్ కలకలం కలిగిస్తోంది. ఆదేశంలో బర్డ్ ప్లూ వ్యాధి కలకలం రేపుతోంది. బర్డ్ ప్లూ జాతికి చెందిన హెచ్ 3ఎన్ 8 రకం వైరస్ లక్షణాలు మనుషుల్లో కూడా గుర్తించారు. సాధారణంగా పక్షుల్లో కనిపించే ఈ వైరస్ మనుషులకు సంక్రమించడం చైనాలో ఇదే తొలిసారి.హెనాన్ ప్రావిన్స్ లో ఈ వైరస్ ఓ నాలుగేళ్ల బాలుడికి సంక్రమించినట్లు చైనా నేషనల్ హెల్త్ కమిషన్ వెల్లడించింది. ఎప్రిల్ 26న బాలుడిలో వైరస్ ఉన్నట్లు నిర్థారించారు. బాలుడు పక్షులతో నేరుగా కాంటాక్ట్ కావడం వల్ల ఈ వ్యాధి సోకినట్లు తెలుస్తోంది. బాలుడికి స్వల్ప జ్వరంతో బాధపడుతున్నట్లు వైద్యం అందిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. బాలుడి కుటుంబం కోళ్లు, బాతులను ఇంటి పరిసరాల్లో పెంచుతుంటారు… ఈ నేపథ్యంలో వాటికి వ్యాధి సోకిన తర్వాత బాలుడికి బర్డ్ ఫ్లూ సోకినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version