గూగుల్ పిక్సెల్ 6ఏ స్మార్ట్ ఫోన్.. ఫీచర్లు, కెమేరా వివరాలు ఇవే..!

-

గత కొంత కాలంగా.. గూగుల్ పిక్సెల్ 6ఏ స్మార్ట్ ఫోన్ గురించి వార్తల్లో వింటూ ఉన్నాం..అయితే వచ్చిన లీకులను కంపెనీ అధికారింగా చెప్పనప్పటికీ టెక్ నిపుణులు కన్ఫర్మ్ చేశారు. దీంతోపాటు.. గూగుల్ పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రో స్మార్ట్ ఫోన్లను కూడా కంపెనీ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు ఫోన్లూ యూఎస్ ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (ఎఫ్‌సీసీ) వెబ్‌సైట్‌లో కనిపించాయి.
లీకైన సమాచారం ప్రకారం.. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. ముందువైపు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. గూగుల్ పిక్సెల్ 7 సిరీస్ కూడా ఈ సంవత్సరమే లాంచ్ చేయనున్నారు. ఇక గూగుల్ పిక్సెల్ 6ఏ మాత్రం మే నెలలో జరగనున్న గూగుల్ ఐవో 2022 సదస్సులో లాంచ్ కానుంది..
ఎఫ్‌సీసీ లిస్టింగ్‌లో కూడా ఈ ఫోన్ కనిపించింది. జీఎక్స్7ఏఎస్, జీబీ17ఎల్, జీబీ62జెడ్, జీ1ఏజెడ్‌జీ మోడల్ నంబర్లతో చాలా గూగుల్ ఫోన్లు ఈ లిస్టింగ్‌లో కనిపించాయి. ఇవి గూగుల్ పిక్సెల్ 6ఏ లేదా గూగుల్ పిక్సెల్ 7 సిరీస్‌లో భాగం అయ్యే అవకాశం ఉందట.
వీటిలో జీఎక్స్7ఏఎస్ మోడల్ ఉన్న స్మార్ట్ ఫోన్ గూగుల్ పిక్సెల్ 6ఏ వేరియంట్ టెక్ నిపుణులు అంటున్నారు. ఎఫ్‌సీసీ లిస్టింగ్ ప్రకారం ఈ ఫోన్లలో 5జీ, ఎల్టీఈ, ఎన్‌ఎఫ్‌సీ, వైఫై 6ఈ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉండనున్నట్లు తెలుస్తుంది.
ఇక కెమేరా విషయానికి వస్తే.. ఫోన్ వెనకవైపు 12 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది. బ్లాక్, గ్రీన్, వైట్ కలర్ ఆప్షన్లలో ఇది లభిస్తుంది. సెల్ఫీ కెమెరా కోసం ఇందులో హోల్ పంచ్ కెమెరా ఉండనుంది. 6.2 అంగుళాల డిస్‌ప్లేను గూగుల్ ఇందులో అందించనుంది. 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉండనున్నట్లు సమాచారం.
గూగుల్ పిక్సెల్ 6ఏ స్మార్ట్ ఫోన్ గతంలో లాంచ్ అయిన పిక్సెల్ 5ఏ 5జీకి తర్వాతి వేరియంట్‌గా ఉండనుంది. ఈ ఫోన్ గతంలో గీక్‌బెంచ్ లిస్టింగ్‌లో కనిపించింది. గూగుల్ టెన్సార్ జీఎస్101 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ లాంచ్ కానుందని తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంతో ఈ ఫోన్ రానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version