ఏడు నెలలకే చిన్నారి జననం.. ప్రాణం పోసిన ఈఎస్ఐ డాక్టర్లు

-

హైదరాబాద్ లోని సనత్ నగర్ లో ఈఎస్ఐ డాక్టర్లు అద్భుతం చేశారు. నెలలు నిండకుండానే.. తక్కువ బరువుతో పుట్టిన చిన్నారికి పునర్జన్మనిచ్చారు.710 గ్రాముల బరువుతో జన్మించిన పసికందును 112 రోజులపాటు కంటికి రెప్పలా కాపాడి, ఆ చిన్నారి కోలుకున్న తర్వాత బుధవారం తల్లికి అప్పగించారు. బయట ప్రైవేటు ఆస్పత్రులకు తీసుకెళ్తే రూ. 20 లక్షల వరకు ఖర్చు చేయాల్సిన చికిత్స పైసా ఖర్చులేకుండా ఉచితంగా అందించారు. వివరాల్లోకి వెళితే..మేడ్చల్ కి చెందిన రూబీ దేవి కి ఇంతకు ముందు ఏడు సార్లు గర్భం దాల్చాగా.. అబార్షన్ అయ్యింది.8 సారి గర్భందాల్చిన ఆమెను సమస్యలు విధించాయి.

ఈసారి కూడా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి ఏమో అని రూబీ దేవి తో పాటు కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఈ పరిస్థితుల్లో డాక్టర్ల సూచన మేరకు 18 వారాల గర్భం తో ఆమె ఈఎస్ఐ హాస్పిటల్ లో చేరింది. 27 వారాలకే ఆమెకు ప్రసవం జరిగి పాపకు జన్మనిచ్చింది. ఆరోగ్యవంతమైన శిశువు బరువు 2.5 -3 ఉండాల్సి ఉండగా.. ఈ పాప కేవలం 710 గ్రాముల బరువుతోనే పుట్టింది. 8 నెలలు కూడా నిండకుండానే జన్మించడంతో ఎదుగుదల సైతం పూర్తిగా లేదు. కాగా 112 రోజులపాటు ఈఎస్ఐ వైద్యులు కంటికి రెప్పలా చూసుకోవడంతో ఆ చిన్నారి క్రమంగా బరువు పెరిగి 1.95 కిలోలకు చేరుకుంది. చిన్నారి ఆరోగ్యంగా ఉండడంతో బుధవారం డాక్టర్లు ఆ పసికందును తల్లిదండ్రులకు అప్పగించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version