జూనియర్ ఎన్టీఆర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ పరంగా టాప్ లో ఉండే హీరో అని చెప్పవచ్చు. డైలాగ్స్ పరంగా, యాక్టింగ్ పరంగా, యాంకరింగ్ పరంగా ఎన్టీఆర్ కు ఎవరు సాటిరారు అని చెప్పవచ్చు. అయితే చిన్న వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. ఎన్టీఆర్ లైఫ్ స్టైల్ ఏమిటో ఇప్పుడు పూర్తి వివరాలను తెలుసుకుందాం.
జూనియర్ ఎన్టీఆర్ మే 20 -1983 న జన్మించారు. ఇక ఈయన తండ్రి నందమూరి హరికృష్ణ – తల్లి షాలిని. ఎన్టీఆర్ చిన్న వయసు నుండే కూచిపూడి నాట్యం నేర్చుకున్నారు. 1991వ సంవత్సరంలో మొదటిసారిగా తన సినిమాకి క్లాప్ కొట్టించుకున్నాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ డైరెక్షన్ లో బ్రహ్మర్షి విశ్వామిత్ర అనే హిందీ సినిమాలో నటించారు. ఇక ఆ తర్వాత డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన బాల రామాయణం చిత్రంలో నటించారు.ఇక 2001వ సంవత్సరంలో నిన్ను చూడాలని సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఎన్టీఆర్ కెరీర్ పరంగా అవార్డ్స్ చాలానే వచ్చాయి. 2016 లో నాన్నకు ప్రేమతో, 2017 లో జై లవకుశ, యమదొంగ, జనతా గ్యారేజ్, టెంపర్ వంటి చిత్రాలకు అవార్డులు గెలుచుకున్నాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ కు హైదరాబాదులో రూ.30 కోట్లు విలువ చేసే ఒక ఇల్లు ఉంది. ఇక తాజాగా బెంగళూరులో కూడా ఒక ఇంటిని కొన్నాడు. కొన్ని మీడియా వర్గాల సమాచారం.. ప్రకారం ఎన్టీఆర్ ఆస్తి విలువ రూ.440 కోట్ల రూపాయలు ఉన్నది. ఎన్టీఆర్ సంవత్సర ఆదాయం 45 కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్టు కింద ఆర్థిక సహాయం చేస్తూ ఉంటాడు. ఎన్టీఆర్ లక్ష్మీప్రణతి ని 2011వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. ఇక వీరిద్దరికీ అభయ్ రామ్, భార్గవ్ రామ్ అనే కుమారులు ఉన్నారు. ఇక ఈ రోజున ఎన్టీఆర్ పుట్టినరోజు కనుక ఈ విషయాలను తెలియజేయడం జరిగింది.