మ‌రో చిరు వ‌చ్చాడ్రా .. బ‌ర్త్ డే బోయ్ చ‌ర‌ణ్

-

అప్ప‌టిదాకా చిరు ఒక్క‌డే కానీ చిరు ను పోలిన చిరు ఒక్క‌డు వ‌చ్చాడు ఆయ‌న పేరు రామ్ చ‌ర‌ణ్ తేజ్. అన్న‌య్య కొడుకు.. కొణెద‌ల వారింటి వార‌సుడు..ఇలా చెప్పుకోవ‌డం క‌న్నా అన్న‌య్య‌ను పోలిన యువ‌కుడు. తానేంటో నిరూపించుకుని తీరాలి అన్న త‌ప‌న ఉన్న కుర్రాడు చ‌ర‌ణ్. చిరు స‌ర్ కొడుకా ఎలా ఉంటాడు అని చాలా మంది ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం పూరీ ఇచ్చాడు. డైరెక్ట‌ర్ పూరి స‌ర్ కు కూడా ఇదొక స‌వాలు కానీ భ‌రించాడు. స‌హించాడు. అన్న‌య్య కొడుకును చిరుత‌గా ఇంట్ర‌డ్యూస్ చేసి స‌క్సెస్ కొట్టాడు.

ఈ సారి సినిమా మామూలు సినిమా కాదు మామ అల్లు అర‌వింద్.. నాలుగు డ‌బ్బులు ఎక్కువ పెట్టి మ‌గ‌ధీర అనే ప్రాజెక్టుకు ఒప్పుకున్నాడు. మొద‌టి సినిమా ద‌త్తుగారి బ్యాన‌ర్. రెండో సినిమా అల్లు అర‌వింద్ బ్యాన‌ర్ గీతా ఆర్ట్స్. అన్న‌య్య కొడుకు రాజ‌మౌళి చేతిలో ప‌డ్డాడు.. పెద్ద సినిమా.. అప్ప‌టికే యాక్టింగ్ ఎక్స్ పీరియెన్స్ అంతంత మాత్రంగా ఉన్న కుర్రాడికి నిరూపించుకునేందుకు కావాల్సినంత స్పేన్ ఉన్న సినిమా. రాజ‌మౌళి ఒకే అయ్యారు.. అర‌వింద్ కూడా ఒకే అన్నారు. ధీర ధీర మ‌గ‌ధీర వ‌చ్చాడు. మండే సూరీడు వాడు మండే అగ్ని గోళం వాడు.. ఆ విధంగా రెండో సినిమా పెద్ద హిట్టు. త‌రువాత చాలా సినిమాలు చేశాడు. కొన్ని యావ‌రేజ్ అయ్యాయి. కొన్ని హిట్ అయ్యాయి. సినిమా ఆడినా ఆడ‌క‌పోయినా చిరంజీవి అబ్బాయి ఎన్నో అవ‌రోధాలు దాటాడు.

ఇప్పుడు ట్రిపుల్ ఆర్ తో స‌త్తా చాటాడు. బాలీవుడ్ కు కూడా కావాల్సినంత స్ట‌ఫ్ ఇచ్చాడు. మ‌ధ్య‌లో జంజీర్ తో ప్ర‌య‌త్నాలు చేసినా సక్సెస్ కాలేక‌పోయాడు. కానీ ఇప్పుడు మంచి పేరు తెచ్చుకున్నాడు. రంగ స్థ‌లం లాంటి సినిమా ఎంత పేరు తీసుకువ‌చ్చిందో అంత‌కుమించిన పేరు ట్రిపుల్ ఆర్ తో త‌మ హీరోకు వ‌చ్చింద‌ని చ‌ర‌ణ్ అభిమానులు ఆనందంతో ఊగిపోతున్నారు. ఇవాళ చ‌రణ్ బ‌ర్త్ డే హ్యాపీ బ‌ర్త్ డే చెర్రీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version