నాలుగు వెబ్సైట్లు పెట్టి 50 కోట్లు దోచేశాడు

-

తక్కువ లాభాలకు ఎక్కువ పెట్టుబడి వస్తుందని ఎవరైనా చెప్పినా వినకండని పోలీసులు ఎంత చెప్పినా జనం వినరు వాళ్ళు మోసం చేస్తున్నారని తెలిసాక అప్పుడు పోలీసుల దగ్గరకు వెళ్లి మొర పెట్టుకుంటారు. ఈరోజు బిట్ కాయిన్ వ్యాపారం పేరుతో భారీ మోసం చేసిన సిరిమల్ల నాగరాజు అనే కేటుగాడు అరెస్ట్ అయ్యాడు. నాగరాజును అరెస్ట్ చేసిన హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు రిమాండ్ కు తరలించారు. ఆన్ లైన్ బిట్ కాయిన్ పేరుతో 4 వెబ్ సైట్లు సృష్టించి దేశవ్యాప్తంగా నాగరాజు వసూళ్లు చేసినట్టు గుర్తించారు.

పెట్టుబడులు పెడితే 18 వారాల్లో అధిక లాభాలతో చెల్లింపులు చేస్తానని నమ్మించిన నాగరాజు దేశవ్యాప్తంగా 1200 మంది నుంచి సుమారు 50 కోట్లు దాకా వసూలు చేసినట్టు పోలీసుల విచారణలో తెలింది. నాగరాజు తెలంగాణలో 250మంది నుంచి 10కోట్లకు పైగా వసూలు చేసినట్టు గుర్తించారు పోలీసులు. పరారీలో మరికొంత మంది నిందితులు ఉన్నారని వాళ్ళు దొరికితే మరింత సమాచారం తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version