2024లో బాబు సీఎం అవ్వడానికి సూపర్ షార్ట్ కట్ ఇది!

-

టీడీపీ ఇప్పుడున్న పరిస్థితుల్లో 2024లో అధికారంలోకి రావడం కలే అనేది విశ్లేషకుల మాట! క్యాడర్ చేజారిపోతున్నారు.. లీడర్లు గోడదూకేస్తున్నారు.. బాబు భాగ్యనగరానికి పరిమితమైపోతున్నారు.. అందొస్తాడుకున్న లోకేష్ అసమర్ధుడిగా మిగిలిపోతున్నారు.. ఈ పరిస్థితుల్లో టీడీపీని కాపాడేవారెవరు? బాబు ఏమి చేస్తే 2024లో సీఎం అవ్వొచ్చో షార్ట్ కట్ దొరికింది!!

అవును… టీడీపీ ఇప్పుడున్న పరిస్థితుల్లో 2024 ఎన్నికల్లో అధికారంలోకి రావడం సంగతి దేవుడెరుగు.. కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా అయినా వస్తుందా? లేక బీజేపీ – జనసేన కూటమి తరవాత స్థానం వస్తుందా అనే డౌట్ కూడా ఉంది! అయినా పర్లేదు.. 2024లో సీఎం అయ్యే చాన్స్ లు ఉన్నాయి అని చెబుతున్నారు కమ్యునిస్ట్ నారాయణ! ఆయన చెప్పిన షార్ట్ కట్ బాగానే ఉంది కానీ… బాబు అంత సాహసం చేస్తారా లేదా అన్నది ఇక్కడ ప్రశ్న!

మోడీ సర్కార్ తెచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా చంద్రబాబు పోరాడాలని.. ఎన్టీఆర్ పెట్టిన పార్టీని నడిపిస్తున్న బాబు.. ఆయన కోరుకున్న ఫెడరల్ స్పూర్తికి వ్యతిరేకంగా ఉన్న బిల్లుకు తలాడించకూడదని… ఎదురు తిరిగి పోరాడాలని సూచిస్తున్నారు నారాయణ! పోరాడితే పోయేదేమీలేదు.. అంటూ బాబుని రెచ్చగొడుతున్నారు! పైగా మోడీని ఎదురెళ్లి ఢీ కొడితే.. మహా అయితే గతాన్ని తవ్వి, కోర్టుల్లో స్టేలు తెచ్చుకున్న వాటిని తిరగతోడి జైల్లో వేస్తారు.. అనంతరం ఎన్నికల నాటికి బెయిల్ పై వస్తే సీఎం అయిపోవచ్చనేది నారాయణ సూచన!

పాతమిత్రుడు చంద్రబాబుపై ప్రేమతో నారాయణ ఈ సూచన చేశారా.. లేక గతంలో తమను నిండా ముంచిన నాయకుడికి తనవంతు న్యాయం చేయాలనే తలంపుతో అన్నారా అనేది తెలియదు కానీ… బాబు నిజంగా మోడీని ఎదురించి నిలబడి.. పోరాడితే పోయేదేముంది మహా అయితే జైలుకెళ్లడం తప్ప అని నమ్మితే మాత్రం… 2024లో బాబే సీఎం అని అంటున్నారు ఆయన అభిమానులు!!

-CH Raja

Read more RELATED
Recommended to you

Exit mobile version