తెలంగాణ వాకిట పోరు బాట ను విస్తృతం చేసే పని ఒకటి బీజేపీ చేస్తుంది. ఇకపై చేయనుంది. ఇదే సమయంలో క్షేత్ర స్థాయి సమస్యలు, వాటి పరిష్కారాలు విస్మరించడం తగదు అన్నది పరిశీలకులు చెబుతున్న హితవు. ఆ మాటను పాటిస్తే అమిత్ షా పై నమ్మకం, మోడీ నాయకత్వంపై విశ్వాసం ప్రబలి మంచి ఫలితాలు వస్తాయి. తుక్కుగూడ సభ సక్సెస్ కానీ… ఏదో లోపం.. ఏదో ఒక గుణ దోషం వెన్నాడుతోంది.. దిద్దుకుంటే మేలు.. దిద్దుబాటలో ఉంటే ఇంకాస్త మేలు అని రాజకీయ వర్గాలు బీజేపీకి చేస్తున్న సూచన !
తెలంగాణ రాష్ట్ర సర్కారు చేసిన అప్పులపై మాట్లాడారు.. కమీషన్ల కోసమే కొన్ని ప్రాజెక్టులు చేశారని అన్నారు. అదేవిధంగా రాష్ట్రాన్ని కేసీఆర్ మరో బెంగాల్ గా మారుస్తున్నారని కూడా అన్నారు.. ఈ మాటలు చెప్పింది ఎవరో కాదు అమిత్ షా.
ఇంకా చెప్పాలంటే.. నా కొడుకు నా బిడ్డ అని సాగిస్తున్న కేసీఆర్ పాలనను అంతమొందిస్తామని బీజేపీ బాస్ అమిత్ షా నిన్నటి వేళ ప్రతిజ్ఞ చేసి వెళ్లారు. హైద్రాబాద్ శివార్లలో తుక్కుగూడలో జరిగిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ.. వివిధ విషయాలపై కీలకోపన్యాసం ఇచ్చారు. ముఖ్యంగా కేసీఆర్ చేస్తున్న అవినీతిని అంతమొందిస్తామని అంటున్నారు. అదేవిధంగా మైనార్టీల రిజర్వేషన్లు తగ్గిస్తామని, అధికారం బీసీలకూ, దళితలకూ దక్కే విధంగా, సంబంధిత బాధ్యతలు పంచే విధంగా చేస్తామని చెప్పి వెళ్లారు. ఇవే ఇప్పుడు తెలంగాణ వాకిట చర్చకు తావిస్తున్నాయి.