రాష్ట్రంలో ఉన్న 12 ఎస్టీ నియోజక వర్గాలపై బీజేపీ ఫోకస్ చేసింది. మిషన్ 12 పేరుతో కార్యాచరణ ప్రతయేక కార్యాచరణ రూపొదిస్తుంది. దీని కోసం బీజేపీ రాష్ట్ర కమిటీ సమావేశం అయింది. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గుర్రంపొడులో ఎస్టీ మోర్ఛా నేతలపై రాష్ట్ర ప్రభుత్వం లాఠీచార్జి చేసిందని అన్నారు. పోడుభూములపై బీజేపీ కార్యకర్తలు పోరాటం చేసి జైలుకు వెళ్లారని గుర్తు చేశారు.
అలాగే రాష్ట్రంలో ఎస్టీ లకు 12శాతం రిజర్వేషన్లు ఇస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవ్వలేదని ఆగ్రహాం వ్యక్తం చేశారు. అలాగే ఎస్టీలకు పోడు భూములకు పట్టాలు ఇస్తానని చెప్పి ప్రభుత్వం వెనకడుగు వేస్తుందని అన్నారు. ఎస్టీల అభివృద్ధికి ప్రభుత్వం ఎలాంటి కార్యచరణ చేయడం లేదని అన్నారు. బీజేపీ 12ఎస్టీ నియోజకవర్గాల్లో విజయం సాధించాలని అన్నారు. దాని కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. రాష్ట్రంలో అధికారిక పార్టీకి బీజేపీ యే ప్రత్యామ్నాయం అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి హై కమాండ్ కూడా అండగా ఉందని అన్నారు.