ఏడేళ్లు దేశాన్ని పాలిస్తున్న బీజేపీ రైతుల పాలిట రాక్షస పార్టీల మారిందని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. రైతులను ఇబ్బందులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం వరుసగా నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. ఇప్పటికే సాగు చట్టాలు తెచ్చి వందల మంది రైతులను కేంద్ర ప్రభుత్వం పొట్టన పెట్టుకుందని ఆరోపించారు. అలాగే వ్యవసాయ క్షేత్రాల వద్ద మీటర్లు బిగించి బిల్లు వసూల్ చేసి రైతుల రక్తం తాగాలని చూస్తుందిన మండి పడ్డారు.
తాజా గా ఎరువలపై 50 ఏళ్ల నుంచి ఉంటున్న సబ్సడీని ఎత్తేసి భారతీయ జనత పార్టీ రైతుల పాలిట రాక్షస పార్టీగా మారిందని ఆగ్రహించారు. పెంచిన ఎరువల ధరలను తగ్గించేంత వరకు పోరాటం చేస్తామని హరీష్ రావు ప్రకటించారు. అలాగే 2022 నాటి దేశంలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని ప్రకటించిన బీజేపీ.. నేడు వ్యవసాయ రంగాన్నే నిర్వీర్యం చేసే విధంగా కుట్రలు పన్నుతుందని ఆరోపించారు.
ఆదాయం పెంచుడు కాక.. పెట్టుబడి రెట్టింపు అయ్యేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు. అలాగే దేశంలో ఎందరో కార్పోరేట్లకు రుణ మాఫీ చేసిన మోడీ ప్రభుత్వం.. ఒక్క రైతుకు అయినా.. కనీసం రూపాయి రుణ మాఫీ చేసిందా అని ప్రశ్నించారు. కాగ రైతు వ్యతిరేక పార్టీ అయిన బీజేపీకి తీసుకుంటున్న రైతు వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ప్రకటించారు.