ప్రధాని పసుపు బోర్డు ప్రకటన.. బీజేపీ శ్రేణుల సంబరాలు

-

తెలంగాణకు పసుపు బోర్టు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో పసుపు నీళ్లతో ప్రధాని మోదీ, ఎంపీ ధర్మపురి అరవింద్ కు అభిషేకం చేశారు. మోర్తాడ్ మండల కేంద్రంలో మోడీకి పాలాభిషేకం చేశారుఆర్మూర్ పట్టణంలో బీజేపీ నేతలు బ్యాండు బాజాలతో రోడ్లపై టపాసులు కాల్చారు. పసుపుతో ఒకరిపై ఒకరు చల్లుకుంటూ డ్యాన్సులు చేశారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాల్ ముందు టపాసులు పేలుస్తూ సంబరాలు నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి మామిడిపల్లి చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తాహసిల్ చోలేరస్తా దగ్గర బీజేపీ నేతలు టపాసులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. జగిత్యాల నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. మోడీకి పసుపుతో అభిషేకం చేశారు. ర్యాలీలతో హోరెత్తించారు. బీజేపీ మాట నిలబెట్టుకుందని చెప్పారు.

అయితే.. తెలంగాణలో రూ.13,500 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రూ.1932 కోట్ల వ్యయంతో కృష్ణపట్నం-హైదరాబాద్‌ మల్టీ ప్రోడక్ట్‌ పైప్‌లైన్, వరంగల్‌-ఖమ్మం-విజయవాడ హైవే పనులకు శంకుస్థాపన చేశారు. మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నా కుటుంబ సభ్యులారా.. అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సభా వేదికగా ప్రధాని మోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న పసుపు రైతుల కల సాకారమైంది. సభా వేదికగా పసుపు బోర్డుపై ప్రధాని మోడీ కీలక ప్రకటన చేశారు. తెలంగాణకు పసుపు బోర్డు ఇస్తున్నట్లు కీలక ప్రకటన చేశారు. పసుపు రైతుల సంక్షేమం కోసం జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నామని మోడి ప్రకటించారు. పాలమూరు సభ సాక్షిగా ప్రధాని ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version