అమరావతి: మంత్రి పేర్ని నానికి బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. బాబాలు సీఎం కావాలన్న పేర్ని నాని వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. బీజేపీ నేతలు ధియోదర్, సీవీఎల్. నరసింహారావు, సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తంచేశారు.ప్రభుత్వాన్ని కూల్చాల్సిన పని తమకు లేదని ధియోదర్ మండిపడ్డారు. ఆ ఆలోచన కూడా తమకు లేదన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని ఆయన వ్యాఖ్యానించారు. వేల కోట్ల అవినీతి చేసి తమ గొయ్యి తమరే తీసుకున్నారని ఆరోపించారు.
సీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ కేంద్రంపై నిఘా మోపి ప్రజల దృష్టి మరల్చాలనుకుంటున్నారన్నారు. ఫెయిల్ అయిన టీడీపీ డ్రామా స్క్రిప్టును ఫాలో అవుతున్నారని వ్యాఖ్యానించారు.