పెళ్ళై సంవత్సరం అవుతున్నా, శృంగార పరంగా అంతా సరిగ్గానే ఉన్నా కూడా సంతానం కలగడం లేదంటే సంతాన ప్రాప్తిలో ఏదైనా ఇబ్బంది ఉండవచ్చన్న సంగతి గ్రహించాలి. దీనికి కారణాలు చాలా ఉండవచ్చు. మహిళల్లో చూసుకుంటే ఫాలోఫియన్ నాళాలో ఏదైనా అడ్డు ఏర్పడే సమస్య కావచ్చు. ఇంకా అనేక ఇతర కారణాలు ఉంటాయి. ఈ కారణాల గురించి వదిలేస్తే, ఈ కారణాలకి ముందు కనిపించే సంకేతాలేమిటో తెలుసుకుందాం. అంటే, సంతాన ప్రాప్తి తొందరగా కలవకపోవడానికి ముందు కనిపించే సంకేతాలు చూద్దాం.
నెలసరిలో తీవ్రమైన నొప్పి
నెలసరిలో నొప్పి తీవ్రంగా ఉండడం, ఇంకా ఎక్కువ రోజులు నెలసరి జరగడం. జరగాల్సిన సమయం కంటే ఎక్కువ రోజులు నొప్పి ఉండడం. అంతేకాదు నెలసరి సమయంలో విపరీతమైన కడుపు నొప్పి, నడుము నొప్పి, శృంగారం జరిపేటపుడు ఎక్కువ నొప్పి కలగడం జరుగుతుంటుంది. నెలసరి క్రమ తప్పడం కూడా ఇందులో ప్రధాన కారణంగా ఉంటుంది. ఇవి సంతానం కలగకపోవడానికి సంకేతాలు కావచ్చు.
హార్మోన్ సమస్యలు
హార్మోన్ సమస్యలు కారణమయితే గనక, మొటిమలు తీవ్రంగా ఉండడం, శృంగార కోరికలు తగ్గిపోవడం, తలమీద వెంట్రుకలు రాలిపోవడం, ఒకేసారి బరువు పెరగడం, అమాంతం తగ్గిపోవడం వంటి లక్షణాలు కూడా సంతాన ప్రాప్తి కలగకపోవడానికి సంకేతాలు కావచ్చు.
రక్తం రంగు
సాధారణంగా నెలసరిలో బ్లీడింగ్ జరిగినపుడు మొదటి రోజుల్లో రక్తం రంగు కాషాయ రంగులో ఉంటుంది. అలా కాకుండా బ్లీడింగ్ బాగా చిక్కగా అవడం, లేదా బాగా లేత రంగులో అవుతున్న లక్షణాలు కూడా సంతాన ప్రాప్తి కలగకపోవడానికి సంకేతంగా అనుకోవచ్చు.
ఊబకాయం
ఊబకాయంతో బాధపడే స్త్రీలలో ప్రెగ్నెన్సీ కొంచెం కష్టంగా ఉంటుంది.
ఏదైనా వైద్యం తీసుకునేవారు
క్యాన్సర్ వైద్యం తీసుకునేవారిలో, తొందరగా మెనోపాజ్ దశకి చేరుకోవడం, ఫాలోఫియన్ నాళాల్లో ఏదైనా అడ్డంకులు కూడా సంతాన ప్రాప్తి కలగకపోవడానికి కారణాలుగా ఉంటున్నాయి.