అధికార టీఆర్ఎస్ ఎంత హడావిడి చేసిన…అసలు బీజేపీకి అభ్యర్ధులే లేరని మాట్లాడినా…డిపాజిట్లు రావని విమర్శలు చేసినా సరే…తెలంగాణలో మాత్రం బీజేపీ వేగంగా బలపడుతుంది…ఇందులో మాత్రం ఎలాంటి డౌట్ లేదనే చెప్పాలి. ఒక్క ఏడాది సమయంలోనే ఊహించని విధంగా బీజేపీ బలపడుతూ వచ్చింది. కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరగడమే బీజేపీకి బలం అని చెప్పొచ్చు. అలాగే బీజేపీ నాయకులు ఎప్పటికప్పుడు కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటం చేస్తూ…ప్రజా సమస్యలపై గళం ఎత్తుతున్నారు. ప్రజలకు తాము ఉన్నామనే భరోసా ఇస్తున్నారు. అందుకే బీజేపీకి ప్రజా మద్ధతు పెరుగుతుంది.
ఇదే క్రమంలో అక్కడ కాంగ్రెస్, బీజేపీలు బలపడుతూ వస్తున్నాయి. అయితే జిల్లాలో కాంగ్రెస్ కు మొదట నుంచి బలం ఉంది…కానీ అనూహ్యంగా జిల్లాలో కమలం జోరు పెరిగింది. ఇటీవల వచ్చిన సర్వేల్లో కూడా జిల్లాలో బీజేపీకి ఓటింగ్ ఎక్కువ వస్తుందని తేలింది. అలాగే జిల్లాలో ఉన్న కల్వకుర్తి, మహబూబ్ నగర్, గద్వాల్, షాద్ నగర్, ఆలంపూర్ లాంటి నియోజకవర్గాల్లో బీజేపీకి గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయని తెలిసింది. ముఖ్యంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మహబూబ్ నగర్ స్థానంపై బీజేపీ పట్టు సాధిస్తుంది.